అగ్ర రాజ్యం అమెరకా కరోనా తో విలవిల లాడుతోంది. ఒక్కో రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోవడంతో పాటు మృతుల సంఖ్య వేల సంఖ్యలో నమోదు కావడంతో అక్కడి పరిస్థితులు ఆందోళన కరంగా మారాయి. ఇప్పటి వరకూ జరిగిన మరణాలు 4 వేలని దాటగా, కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల పైమాటే. ఎంతో మంది అమెరికా ప్రజలు కరోనా లక్షణాలు ఉన్నాయని ఆసుపత్రులకి వెళ్తున్నా వారికి సరైన పరీక్షలు చేయడంలేని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

 

అమెరికాలో ఉంటున్న ఎన్నో భారతీయ స్వచ్చంద సంస్థలు స్థానికంగా ఉన్న ఎన్నరైలకి సూచనలు, సలహాలు ఇస్తున్నాయి.  కరోనా వ్యాప్తికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేకించి వెబ్ నార్ ద్వారా తెలియచేస్తున్నాయి. ఇదిలాఉంటే తాజాగా అమెరికాలో ఓ ఎన్నారై ఫ్యామిలీ కరోనా బారిన పడింది. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ఉంటున్న భారత ఎన్నారై రోహన్ బవదేకర్ కుటుంభం మొత్తం కరోనా బారిన పడింది.

 

రోహాన్ బవదేకర్ పై ఈ వైరస్ ప్రభావం చూపడంతో  అక్కడి వైద్యులు రోహాన్ ని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నారు. అతడి భార్యా, పిల్లల్ని హోమ్ క్వారంటైన్ లోనే ఉంచి వైద్యం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉంటున్న సేవా ఇంటర్నేషన్ స్వచ్చంద సంస్థ రోహాన్ కుటుంభానికి సాయం అందించడానికి ముందకు వచ్చింది. రోహాన్ కుటుంభానికి మెడిసిన్ లు మౌలిక సదుపాయాలూ అందిస్తూనే రోహాన్ ఆరోగ్య తీర్పుపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అండగా నిలిచింది..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: