అగ్ర రాజ్యం అమెరికా ప్రజలు ఒక్క సారిగా షాక్ కి గురైన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కరోనా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్న న్యూయార్క్ నగరంలో  కొందరు ప్రజలు ఒక్క సారిగా షాక్ తిన్న ఘటన ఇది. న్యూయార్క్ నగరం ఒక్కటే కాదు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు సైతం ఇదే సంఘటన చూసి ఆందోళన వ్యక్తం చేశారు..అందుకు కారణం  ట్రంప్ నగ్నంగా నిలుచుని ఉండటం. ఈ ఘటనని దూరంగా చూసిన ప్రజలు పరుగు పరుగున ట్రంప్ వద్దకి వెళ్లి చూడగా అది ట్రంప్ పోలికలతో ఉన్న విగ్రహం అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు..అయితే

IHG

అగ్ర రాజ్యానికి అధ్యక్షుడే..కానీ ట్రంప్ నగ్న విగ్రహాన్ని అలా ఎందుకు పెట్టారు. అనే వివరాలోకి వెళ్తే.. అమెరికాని ప్రస్తుతం పట్టి పీడిస్తున్న ఏకైక సమస్య కోరనా వైరస్. ఈ వైరస్ కారణంగా వేలాది మంది అమెరికన్స్ ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. అయితే ఇంతగా ఈ వైరస్ అమెరికాలో ప్రభలడానికి గల కారణం కేవలం ట్రంప్ చేతకాని తనమే నంటూ అమెరికా ప్రజలు మందిపడుతున్నారు.

IHG

ట్రంప్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే ఇలాంటి చావులు ఉండేవి కావని, అమెరికాలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్య  ఏర్పడేది కాదని అంటున్నారు. ఈ కారణంగానే ట్రంప్ నాయకత్వంపై విసుగు చెందిన కొందరు న్యాయార్క్ నగరం యూనియన్ స్వార్ లో ట్రంప్ నగ్నంగా ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కేవలం ఆ ఒక్క చోట మాత్రమే కాదు అమెరికా నగర వీదుల్లో చాలా ప్రాంతాలలో ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయగా ప్రజలందరూ ట్రంప్ విగ్రహంతో కలిసి ఫోటోలు దిగారు...

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: