అమెరికాలో కరోనా బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య గంటల వ్యవధిలో మారిపోతోంది. అగ్ర రాజ్యం టెక్నాలజీలో దూసుకుపోయినా కరోనా వైరస్ ని ఎదుర్కునే విషయంలో మాత్రం ఎన్నో ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఎంతో మంది ప్రజలకి ముందస్తు అవగాహన లేకపోవడం వలన, ప్రభుత్వాల హెచ్చరికల అలస్యపు మూల్యం మాత్రం ఎంతో దారుణంగా కనిపిస్తోంది. వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకోగా, లక్షల మంది అమెరికన్స్ కరోనా వ్యాధి సోకి చికిత్స పొందుతున్నారు..ఈ క్రమంలో

 

అమెరికాలో లక్షలాదిగా ఉన్న తెలుగు ఎన్నారైల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎన్నారైల సంస్థలు సమాచారం సేకరిస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఒక ఎన్నారై అమెరికాలో చనిపోగా, ఇటలీ , ఇరాన్, వంటి దేశాలలో సైతం ఒక్కొక్కరుగా ఎన్నారైలు చనిపోయారు. ఇలా మొత్తం 5 ఎన్నారైలు చనిపోగా నిన్నటి రోజున అమెరికాలో ఇద్దరు తెలుగు ఎన్నారై  వైద్యులు  కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.

 

వైజాగ్ కి చెందిన డాక్టర్ .ఎరుబండి సత్యవర్ధన రావు, వరంగల్ కి చెందిన డాక్టర్. అబూ అజహర్ ఇద్దరు అమెరికాలో వైద్యులుగా స్థిరపడ్డారు. ఇద్దరికీ 70 ఏళ్ళ పైమాటే అయితే కొన్ని రోజుల క్రితం ఇరువురికి కరోనా సోకడంతో అప్పటి నుంచీ చికిత్స పొందుతూనే ఉన్నారు కానీ శరీరాలు సహకరించక పోవడంతో ఇరువుని మృతి చందారని తెలుస్తోంది. సుమారు 40 ఏళ్ళ క్రితమే అమెరికాలో స్థిరపడ్డారని భందులు తెలుపుతున్నారు. ఇంకా మృతుల వివరాలు తెలియరాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: