ప్రపంచ దేశాలన్నిటి కంటే కూడా కరోనా మహమ్మారి అమెరికాలో విస్తరిస్తున్న క్రమం అందరికి తెలిసిందే. అమెరికాలో కరోనా భీబత్సాన్ని సృష్టిస్తోంది. గంటల వ్యవధిలో ప్రజలు పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నారు.  అమెరికా వ్యాప్తంగా సుమారు 8 వేలకి పైగా ప్రజలు మృతి చెందగా సుమారు 3.5 లక్షల మంది ప్రజలు కరోనా తో పోరాడుతున్నారు. ఒకపక్క సరైన వైద్య రక్షణ పరికరాలు లేకపోయినా వైద్యులు కరోన రోగులకి సేవలు చేయడంతో ఎంతో మంది వైద్యులు సైతం కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది..

IHG

ఇదిలాఉంటే..అమెరికాలో వలస వెళ్ళిన వారిలో భారతీయుల సంఖ్యే అత్యధికం. కరోనా తీవ్రమైన ప్రభావం చూపుతున్న న్యూయార్క్ నగరంలో భారతీయలు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ అమెరికా వ్యాప్తంగా కరోనా బారిన పడి మృతి చెందిన వారులో భారతీయులు కూడా ఉన్నారని, సుమారు 4 గురు భారతీయ ఎన్నారైలు కరోనా తో మృతి చెందారని తెలుస్తోంది.

IHG: Govt shares dead body management guidelines

ఈ మేరకు ఉత్తర అమెరికా కేరళ సమాఖ్య ఓ ప్రకటన విడుదల చేసింది. 21 ఏళ్ళ ష్వాన్ అబ్రహం, 45 ఏళ్ళ అబ్రహం స్యాముల్ , ఏళ్ళ కురియన్ కోస్ , 51 ఏళ్ళ యంచననట్టు కరోనా భారినపడి మృతి చెందారని తెలిపింది. అయితే మృతి చెందిన వాళ్ళందరూ న్యూయార్క్ కి చెందిన వారు కావడం గమనార్హం. అయితే ఎప్పటికప్పుడు భారతీయులతో మాట్లాడుతున్నామని భారత కాన్సులేట్ తెలిపింది. అమెరికాలో ఉంటున్న భారతీయులకి కరోనా లక్షణాలు ఉంటే తమకి తెలియచేయమని చెప్పినట్టుగా తెలిపింది. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 63 వేలకి పైగా బాధితులు ఉండగా భారతీయులు ఎంతమందికి కరోనా సోకింది అనేది మాత్రం తెలియక పోవడంతో వారి కుటుంభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: