ప్రపంచంలో కరోనా పంజా వేగంగా విస్తరిస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది కేవలం అమెరికా మాత్రమే. సామాజిక దూరం పాటించని కారణంగా ఎంతో మంది అమెరికన్స్ మృతి చెందుతున్నారు. ఇప్పటికీ రోజు రోజుకి వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఈ కేసుల తీవ్రత అత్యధికంగా ఉంది...ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 13 వేలకి చేరుకోగా..బాధితుల సంఖ్య 4 లక్షలుగా నమోదు అవుతోంది...ఇదిలాఉంటే..

 

అమెరికాలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా నెల రోజుల కాలంలో మృతి ఎన్నారైల సంఖ్య నిన్నటితో 7 కి చేరుకుంది. ప్రస్తుత వివరాల ప్రకారం తాజాగా తెలుగు సంతతికి చెందిన ఓ జర్నలిస్ట్ న్యూయార్క్ లో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా లో కరస్పాండెంటు గా పనిచేస్తున్న కంచిబొట్ల బ్రహ్మ అనే 66  ఏళ్ళ తెలుగు వ్యక్తి కి కరోనా లక్షణాలు ఉండటంతో ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంచారు. కానీ..

 

రెండు రోజులకే అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన తనయుడు సుదామా దగ్గరలోనే ఉన్న ఓ ఆసుపత్రోలో చేర్చారు. కానీ రోజు రోజుకి పరిస్థితి చేయి దాటిపోవడంతో ఆయన మృతి చెందారని వాపోయారు. అయితే తన తండ్రి సుమారు 28 ఏళ్ళుగా అమెరికాలో జర్నలిస్ట్ గా పనిచేశారని ఎంతో నిబద్ధతతో నిజాయితీగా ఉండేవారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో తండ్రి భౌతిక కాయాన్ని ఇస్తారో లేదో కూడా తెలియదని విలపిస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: