అమెరికా ఒకానొక సమయంలో ఎంతో మంది ఎన్నారైల కలల సౌధం. అమెరికా వెళ్లి స్థిరపదాలనేది ఎంతో మంది ఉన్నత విద్యావంతుల కోరికగా ఉండేది. అందుకు తగ్గట్టుగానే ఎంతో మంది భారతీయులు అమెరికాలో స్థిరపడి పోయారు. ఎన్నో ఉన్నత ఉద్యోగాలు సంపాదించి ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. కానీ కరోనా సృష్టించిన విలయతాండవానికి భయం గుప్పెట్లో ప్రస్తుతం బ్రతుకుతున్నారు. ఎంతో విలాసవంతమైన జీవితం గడిపిన వారు గత కొన్ని రోజులుగా నిత్యావసర సరుకులు, కూరలని వాడాలంటే  ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. కలలు గన్న అమెరికా ఇప్పుడు ఎన్నారైలకి నరకంగా కనిపిస్తోంది..

IHG'Idea Of India' Is ...

బయటకి వెళ్ళాలంటే భయం, ఇంట్లోనే ఉంటున్నా ఏందో తెలియని ఆందోళన, మంచి నీళ్ళకోసం బయటకి వెళ్ళినా కరోనా సోకుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. బయటకి వెళ్ళినా ఇద్దరిలో ఒక్కరికి తప్పకుండా కరోనా సోకుతోంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా అమెరికాలో వేలాది మంది మరణించారు కానీ అందులో భారత ఎన్నారైలు ఎంత మంది ఉన్నారనేది మాత్రం తెలియడంలేదు. ఇప్పటికి 10 మంది ఎన్నారైలు మృతి చెంది ఉంటారని బహిరంగంగా తెలిసిన లెక్కల ప్రకారం తెలుస్తోంది..కానీ  దాదాపు 100 మంది వరకూ భారతీయులు మృతి చెంది ఉంటారని అంటున్నాయి భారతీయ సంఘాలు..

IHG

అమెరికాలో ఉంటున్న భారతీయ రాయబార కార్యాలయం అక్కడి భారతీయుల గురించి పట్టించుకోవట్లేదని అంటున్నారు ఎన్నారైలు. కొన్ని భారతీయ కుటుంభాలలో వ్యక్తులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయని కానీ వారికి ఎవరూ సాయం చేయడానికి కూడా వెళ్ళడంలేదని తెలుస్తోంది. ఇదిలాఉంటే కరోనా భారిన పడిన న్యూయార్క్ రాష్ట్రంలో సుమారు 50 వేల మంది భారతీయులు ఉండగా వారిలో సుమారు 30 వేలమంది  తెలుగు వారే ఉన్నారని వీరందరూ వారి వారి వాట్సప్ గ్రూప్ ల ద్వారా పరిస్థితులు తెలుసుకుని సాయం అందించుకుంటున్నారని తెలుస్తోంది. అమెరికా మాత్రం ఈ వ్యాధి నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యలు అసలు కనిపించడం లేదని, పూర్తిగా ఎన్నారైలని పక్కన పెట్టేసిందని వాపోతున్నారు..

IHG

 

మరో పక్క కరోనా బారిన పడితే అమెరికాలో వైద్య ఖర్చులకి లక్షల రూపాయలు అవుతుందని, ఇప్పటికే ఎంతో మంది దాతలు భారతీయ ఎన్నారైల కోసం లక్షల డాలర్లు ఇచ్చారని, ఇలాంటి పరిస్థితులో అమెరికాలో ఉండలేక పోతున్నామని బోరున విలపిస్తున్నారు.పట్టించుకునే  వారులేక బయటకి వెళ్ళలేక బిక్కుబిక్కుమంటూ జీవితం గడపాల్సి వస్తోందని ఖర్మ కాలి అమెరికా వచ్చామని ఇండియా వచ్చేయాలని ఉందని అంటున్నారు భారతీయ ఎన్నారైలు..

మరింత సమాచారం తెలుసుకోండి: