ప్రపంచంలో ప్రస్తుతం వినిపించే పేరు కరోనా..ఈ మహమ్మారి ధాటికి ప్రజలు పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నారు. అన్ని దేశాలు ఈ మహమ్మారి దెబ్బకి విలవిలలాడిపోతున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా అయితే అతలాకుతలం అవుతోంది. దాంతో నష్ట నివారణ చర్యలు చేపట్టిన పలు దేశాలు కరోనా భయంతో వివిధ రకాలుగా ఆంక్షలు విధించాయి. దాంతో ఎప్పుడూ పాటించని రూల్స్ ని ఒక్క సారిగా అనుసరించాలంటే ప్రజలకి కష్టమవుతోంది. సౌదీ లాంటి దేశాలలో ఉమ్మి బహిరంగ ప్రదేశాలలో వేసినా కటినమైన శిక్షలు వేస్తున్నారు. అయితే అలవాటులో పొరబాటు ఓ భారతీయుడిని జైలు జీవితం గడిపేలా చేసింది. వివరాలోకి వెళ్తే..

 

సౌదీ లోనే ఉంటున్న వరంగల్ కి చెందిన ఓ భారతీయుడు ఓ సూపర్ మార్కెట్ కి వెళ్ళాడు. అక్కడ అనుకోకుండా అతడికి తుమ్ము వచ్చి తుమ్మేశాడు కానీ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెద్దగ పట్టించుకోలేదు. తుమ్మినోడు అలా ఉండకుండా అడ్డుపెట్టుకున్న చేతిని అక్కడి వస్తువులమీద పెట్టాడు. అదే సమయంలో అక్కడ ఓ అరబ్బు పిల్ల చూసి వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేసింది..

 

ఫిర్యాదు మేరకు సూపర్ మార్కెట్ కి వచ్చిన పోలీసులు విచారణ చేసి అతడిని అరెస్ట్ చేసి కరోనా పరీక్షలకి అతడి సాంపిల్స్ పంపారు. ఊహించని విధంగా అతడికి కరోన పాజిటివ్ వచ్చింది. దాంతో పోలీసులు అతడిపై హత్యా నేరం మోపి జిలికి పంపారు. నాకు కరోన ఆందని తెలియదని, సూపర్ మార్కెట్ లో నేను కావాలని ఇలా చేయలేదని ఎంతగా మొత్తుకున్నా వినలేదు. అతడిని అరెస్ట్ చేసి ఆసుపత్రికి పంపారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: