అమెరికాలో ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 22 వేలుగా నమోదు కాగా..కరోనా బారిన పడిన వారి సంఖ్య 5.55 లక్షలుగా నమోదు అయ్యింది..అయితే అమెరికాలో కరోనా తీవ్ర స్థాయిలో ప్రభలడానికి, వేలాది మంది మృతి చెందడానికి కారణం అధ్యక్షుడు ట్రంప్ నేనా..?? కరోనా ముంచు కొస్తోందని  తెలిసినా ముందస్తు  చర్యలు ట్రంప్ ఎందుకు తీసుకోలేదు..?? ఇప్పుడు ఈ ప్రశ్నలు అమెరికా ప్రజలని వేధిస్తున్నాయి. అమెరికా దిగ్గజ పత్రిక “న్యూయార్క్ టైమ్స్” విడుదల చేసిన ఓ సంచలన కధనం ఇందుకు కారణం..

IHG

అమెరికా ఎంతో గొప్ప దేశం..ఇక్కడ అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయి. విపత్తులని పసిగట్టగలిగే టెక్నాలజీ అందుకు తగ్గట్టుగా ఆర్ధిక వ్యవస్థ..బలమైన రక్షణ, ఇంటిలిజన్స్ వ్యవస్థ ఇన్ని ఉన్నా అమెరికా కరోనా మహమ్మారికి ఎలా బలై పోయింది అంటే కోణంలో ప్రపంచ ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ తెలిపిన వివరాలు రిపబ్లికన్ పార్టీని  ఓ కుదుపు కుదిపేశాయి. ఇప్పటి వరకూ అమెరికాలో జరిగిన 20 వేల మరణాలకి ట్రంప్ మాత్రమే ప్రధాన కారకుడని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకొచ్చాయి..

IHG

కరోనా ఏ స్థాయిలో ఉంటుందో..ఇప్పటికే చైనా ప్రజలు ఈ వైరస్ ధాటికి ఎలా చనిపోయారో ట్రంప్ కి వైట్ హౌస్ అధికార యంత్రాంగం అలాగే ఇంటిలిజన్స్ అధికారులు, వైద్య నిపుణులు నివేదికలు జనవరి నెలలోనే ఇచ్చారట. ఈ విషయాన్ని న్యూయార్క్ టైం ప్రచురించింది. అమెరికాలోకి ఈ వైరస్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా వివరించారట. కానీ ట్రంప్ మాత్రం వారి మాటలని పట్టించుకోలేదని అమెరికా ఆర్ధిక వ్యవస్థపైనే దృష్టి పెట్టారని ముందస్తు చర్యలపై గనుకా ట్రంప్ స్పందించి ఉంటే అమెరిక ప్రజలు ఎంతో మంది ప్రాణాలతో ఉండేవారని ఈ కధనంలో కుండ బద్దలు కొట్టినట్టుగా రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: