ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ తో కువైట్ లో ప్రవాసాంధ్రులు ఇబ్బందులు పడుతున్నారు. భారత్ కు తిరిగి రావడానికి అవస్థలు పడుతున్నారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా గత కొన్ని వారాలుగా భారత్, కువైట్ మధ్య వివాదం నెలకొంది. 
 
ప్రధాని నరేంద్రమోదీ జోక్యంతో ప్రస్తుతం ఈ వివాదం కొలిక్కివచ్చింది. శనివారం భారత వైమానిక దళానికి చెందిన వైద్య బృందం కువైట్ కు చేరుకుంది. కువైట్ లో ఇప్పటివరకు కరోనా నిర్ధారణ అయిన వారిలో ఎక్కువమంది భారతీయులు ఉన్నారు. కువైట్ లో ఉపాధి రంగం కూడా కుదేలవడంతో వీళ్లు సొంతూళ్లకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కువైట్ లో ఉన్న విదేశీయుల్లో 60 శాతం మంది భారతీయులే. వీరిలో ఏపీకి చెందిన వారే ఎక్కువగా కువైట్ లో పని చేస్తున్నారు. 
 
వీరిలో చాలా మంది దగ్గర పాస్ పోర్టులు లేవు. వైద్య బృందం వారిని కువైట్ లోనే క్వారంటైన్ లో ఉంచుతుందా...? లేక ఇండియాకు తీసుకువస్తుందా...? తెలియాల్సి ఉంది. కువైట్ లో భారతీయులే అధిక సంఖ్యలో ఉండటంతో అక్కడి ప్రభుత్వం భారతీయులు స్వదేశాలకు వెళ్లడానికి క్షమాభిక్ష ప్రకటించింది. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఉపాధి నిమిత్తం కువైట్ కు వెళ్లారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: