అమెరికాలో కరోనా తీవ్ర స్థాయిలో తన ప్రభావం చూపుతోంది. కేవలం కొన్ని గంటల వ్యవధిలో మృతుల సంఖ్య పెరగడంతో అమెరికా వాసులకి కంటి మీద కునుకు లేకుండాపోతోంది. ఈ మహమ్మారి ఎక్కడ తమకి సోకుతుందోనని ప్రజలు కంగారు పడిపోతున్నారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యి పోయారు. ఎక్కడికక్కడ వ్యవస్థలన్నీ స్థంభించి పోయాయి. ఒక పక్క నిరుద్యోగం..చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి..ఈ పరిస్థితులే ఇప్పుడు వలస వాసులపై తీవ్ర ప్రభావాని చూపుతున్నాయి..

IHG's new executive order on H1B visas STRANGLES <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIAN' target='_blank' title='indian-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>indian</a> IT sec

అమెరికా వ్యాప్తంగా హెచ్-1 బీ వీసాపై కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న దాదాపు 40వేల మంది ఉద్యోగాలు తొలగించ బడ్డాయి. దాంతో వలసవాసుల పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఇదిలాఉంటే వచ్చే మరో రెండు నెలలలో సుమారు 60వేల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అలాగే భవిష్యత్తులో భారీ దిగ్గజ బోయింగ్ వంటి కంపెనీలు ఐటీ కంపెనీలకి ఇచ్చిన ఆర్డర్లని రద్దు చేసుకున్నాయని తెలుస్తోంది..

IHG

న్యూయార్క్ టైమ్స్ చెప్పిన వివరాల ప్రకారం..భవిష్యత్తులో అమెరికాలో ఐటీ కంపెనీలకి గడ్డు కాలమే అంటూ రాసుకొచ్చిన కధనం వలస వాసులలో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కరోనా చేస్తున్న విలయాన్ని తట్టుకోలేక ఉద్యోగాలు లేక ఇళ్లకే పరిమితమై పోయిన భారతీయుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరి రాయారయ్యింది. హెచ్ -1 బీ వీసా ఉన్న వారు ఉద్యోగం కోల్పోయిన తరువాత తమ వీసాలని స్టేటస్ కొనసాగించాలంటే ఫెడరల్ ప్రభుత్వానికి నెలకి గాను సుమారు 1000 డాలర్లు చెల్లించాలి లేదంటే వీసా రద్దయ్యే ప్రమాదం ఉంటుంది. దాంతో ప్రస్తుతం తాము దాచుకున్న సంపాదన నుంచీ డబ్బులు తీసి నెలవారీ చెల్లింపులు చేస్తున్నారట. ఇంత దయనీయ పరిస్థితి అసలు ఇప్పటి వరకూ మాకు కలగలేదని ఎన్నారైలు బోరుమంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: