అమెరికాలో ఉన్న ఎన్నారైలకు ట్రంప్ సర్కారు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అసలే దేశం కాని దేశంలో చిక్కుకుపోయామనుకుంటున్న వారికి ఊరట కల్పించింది. హెచ్ 1 బి వీసాదారుల గడువు పెంచింది. ఈ వీసాదారుల మరికొంత కాలం ఉండేందుకు దరఖాస్తులు స్వీకరించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.

 

 

అమెరికా భారత్ సహా పలు దేశాలకు చెందిన నిపుణులకు హెచ్ ఒన్ బి వీసాలు ఇస్తుంటుంది. అయితే వీటికి గడువు ఉంటుంది. తాజాగా కరోనా పరిణామాలలో అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. గడువు తీరిన వారు ఇండియా వచ్చేందుకు అవకాశం కూడా లేదు. దీంతో పలువురు హెచ్ 1 బి వీసాదారులు అమెరికాలో ఉండిపోయారు.

 

 

ఇప్పటికే కొందరి వీసా గడువు ముగియగా.. మరి కొందరికి త్వరలోనే ముగుస్తాయి. దీంతో ట్రంప్ సర్కారు వీరికి మరో అవకాశం కల్పిస్తోంది. వీరి గడువు పొడిగించేందుకు త్వరలోనే దరఖాస్తులు స్వీకరిస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

 

 

అభ్యర్థులు సరైన సమయంలో దరఖాస్తులు చేస్తే వారు చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్నట్టుగా భావించబోమని ప్రకటించింది. హెచ్ 1 బి వీసాదారులు తాము పని చేస్తున్న కంపెనీ ప్రస్తుత యజమాని, ఇప్పుడున్న నిబంధనలు, షరతులకు అనుగుణంగా ఉంటే 240 రోజుల గడువు దానంతట అదే లభిస్తుందని చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: