ప్రపంచ ఆర్ధిక వ్యవస్థని కరోనా కుదిపేసింది. ప్రస్తుతం అన్ని దేశాల ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారిపోయింది. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి ఏ దేశంలోనూ కనిపించడం లేదు. ఇదిలాఉంటే అగ్ర రాజ్యం అమెరికా పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఎక్కడ తమ అగ్ర రాజ్య ఖ్యాతి కోల్పోవాల్సి వస్తుందోనని తెగ హైరానా పడుతోంది. దాంతో నష్ట నివారణ చర్యలకి సిద్దమయ్యింది. మళ్ళీ అమెరికా ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టేందుకుకి ఆరుగురు భారతీయులకి కీలక బాధ్యతలు అప్పగించింది..

IHG

 

అమెరికా ఆర్ధిక పరిస్థితి చేయిదాటి పోతోందని ఆదేశ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మెన్ జేరోమ్ హెచ్ పావెల్ వెల్లడించడం అమెరికన్ల ను ఆందోళనలోకి నెట్టేసింది. ఈ కారణంగానే ట్రంప్ లాక్ డౌన్ విధించలేదు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నేపధ్యంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి పెద్ద కంపెనీలకి సాయం అందించడానికి ప్రభుత్వం ఆర్ధిక ప్యాకేజ్ ప్రకటించింది. మరో వైపు నిరుద్యోగ బృతి ఇస్తోంది..ఇలాంటి పరిస్థితులలో అమెరికా ఆర్ధిక వ్యవస్థపై పెను భారం పడనున్న నేపధ్యంలో ట్రంప్ కి మన భారతీయులే దిక్కయ్యారు..

IHG

అమెరికాలోని వివిధ రంగాలలో కీలకంగా ఉన్న ప్రముఖులు అందరిని కొన్ని బృందాలుగా చేశారు. ఈ బృందాలలో ఆరుగురు భారతీయులని ట్రంప్ ఏరికోరి నియమించుకున్నారు. వారిలో ఒకరు గూగుల్ సిఈవో సుందర్ పిచాయ్ , మైక్రోసాఫ్ట్ సిఈవో సత్య నాదెళ్ళ, ఐబీఎం సిఈవో అరవింద్ కృష్ణ, మైక్రాన్ సిఈవో సంజయ్, పెర్నాద్ రికార్డ్ బెవరేజస్ సిఈవో ముఖర్జీ, మాస్టర్ కార్డ్ సిఈవో అజయ్ బంగా ఉన్నారు. వీరు అమెరికాలో ఉన్న వివిధ రంగాలలో ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యలని ఎలా గట్టున పడేయాలో ట్రంప్ కి సూచనలు అందించనున్నారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: