అమెరికాలో కరోనా మహమ్మారి చేస్తున్న విలయతాండంవానికి గంటల వ్యవధిలో లోనే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా ప్రభావం ఏ దేశం మీద కూడా అంతగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. ఒక్క రోజులోనే 4వేల మరణాలు చోటు చేసుకోవడంతో ప్రజల మరింత భయబ్రాంతులకి లోనవుతున్నారు. లక్షలాది మంది  ప్రజల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. దాంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమెరికా ప్రజలు ట్రంప్ పాలనపై ఏ విధమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారోనని ఓ సర్వే జరిగింది. అయితే ఇప్పుడు ఆ సర్వేనే ట్రంప్ కొంప ముంచింది..

IHG

అమెరికాలో కరోనా ఉదృతం అవ్వడానికి అదేవిధంగా మృతుల సంఖ్య పెరగడానికి, ఆర్ధిక రంగం పతనానికి ప్రధాన కారణం ట్రంప్ అంటూ రెండు రోజుల క్రితం న్యూయార్క్ టైమ్స్ తమ పత్రికలో ప్రచురించిన విషయం విధితమే. ఈ నేపధ్యంలో అసలు ట్రంప్ గురించి అమెరికా ప్రజలు ఏమని అనుకుంటున్నారు..ట్రంప్ పాలనపై, కరోనా వైరస్ పై ట్రంప్ చేపడుతున్న చర్యలపై ప్రజల స్పందన ఎలా ఉంది అనే విషయంపై ఓ సర్వే జరిగింది.

IHG

వ్యూ రిసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 5000 మంది పాల్గొని తమ అభిప్రాయాలని ప్రకటించారు. ఈ సర్వే తాలూకు వివరాలని తాజాగా సదరు సంస్థ ప్రకటించింది. ట్రంప్ కరోనా వైరస్ కట్టడికి చర్యలు బాగా తీసుకుంటున్నారా..వేగంగా స్పందించారా అని అడిగిన ప్రశ్నకు దాదాపు 68 శాతం మంది ప్రజలు లేదనే సమాధానం ఇచ్చారట. రాబోయే రోజుల్లో కరోనా ప్రభావం ఉండబోతోందా దీనికి కారణం ట్రంప్ అలసత్వమేనా అన్న ప్రశ్నకి సుమారు  80శాతం మంది ప్రజలు అవునని చెప్పారట. ఇప్పటికే ట్రంప్ నానా తంటాలు పడి కరోనా ద్వారా వచ్చిన అపకీర్తిని పూడ్చుకోవాలని, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కరోనా ప్రభావం ఉండకూడదని జాగ్రత్తలు తీసుకుంటుంటే తాజాగా ఈ సర్వే ట్రంప్ ని ఇరకాటంలోకి నెట్టేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: