ప్రపంచ వ్యాప్తంగా కరోనా భారీ ప్రళయాన్ని సృష్టించింది. ఎవరూ ఊహించనంతగా అంచనాలకి అందనంతా  దాని ప్రభావాన్ని చూపిస్తోంది. శత్రువు పగబట్టినట్టుగా కరోనా అమెరికాపై పగబట్టి అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఆర్ధిక , ప్రాణ నష్టాని మిగిల్చింది. అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి సారిగా డిజాస్టర్ డిక్లరేషన్ ప్రకతిచాల్సి వచ్చింది. ఎన్నో వందల కంపెనీలు మూతపడటంతో ఉద్యోగాలు కోల్పోతున్నారు. దాంతో అమెరికా ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో పడింది...అయితే

IHG

అమెరికా ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా పతనమైనతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో గ్రహించిన ట్రంప్ అందుకు తగ్గట్టుగా 2 ట్రిలియన్ ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఇదిలాఉంటే కేవలం కరోనా ప్రభావం చిన్న తరహా వ్యవస్థలు, ఐటీ కంపెనీలపై మాత్రమే కాదు వ్యవసాయ రంగంపై కూడా తన ప్రభావాని చూపించింది. రెస్టారెంట్ లు , విద్యా సంస్థలు మూతపడటంతో ఒక్క సారిగా వ్యవసాయ ఉత్పత్తులకి ఘిరాకీ లేకుండా పోయింది..

IHG

అమెరికాలోనే అతిపెద్ద డైరీ ఫార్మర్స్ సంఘం వ్యవసాయ రంగంపై ప్రభావాన్ని స్వయంగా వివరించింది. ప్రతీ రోజు సుమారు 3. 7 మిలియన్ గ్యాలెన్ ల పాలు వృధాగా నేల మీద పోసేయాల్సి వస్తోందని అంటున్నారు. రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని వారు గొళ్ళు  మంటున్నారు. ఈ పరిస్థితులని గమనించిన ట్రంప్ రైతులని ఆదుకునేందుకు దాదాపు 1. 50 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఇది కేవలం రైతులకి సంభందించిన డబ్బని నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తుందని ప్రకటించారు ట్రంప్. ఇదిలాఉంటే ఇప్పటివరకూ అమెరికా వ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది ప్రజలు కరోనా బారిన పడగా సుమారు 37 వేల మంది పైనే మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: