ఈ ప్రపంచంలో సాయం చేయాలనే ఆలోచన చాలా మందికి కలగదు..ఒక వేళ కొంతమందికి కలిగినా ఎదో ఆశించి సాయం చేస్తున్న వాళ్ళే అధికంగా ఉంటున్నారు. కానీ ఎలాంటి పొగడ్తలు లేకుండా...ప్రపంచానికి తమ సేవలు తెలియకుండా నిస్వార్ధంగా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇలా నిస్వార్ధంగా సేవ చేస్తున్న ఓ ట్యాక్సీ డ్రైవర్ ని తమదైన రీతిలో సత్కరించుకున్నారు వైద్యులు..ఈ సందర్భంగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..వివరలోకి వెళ్తే..

IHG's why Spanish cab <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DRIVER' target='_blank' title='driver-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>driver</a> got standing ovation ...

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఎంతో మంది అనారోగ్యంగా ఉన్న వారు ఈ కరోనా కారణంగా ఆర్ధిక స్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఇలాంటి ఘటనలు చూసిన స్పెయిన్ కి చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్ చెలించిపోయాడు, మానవత్వం చాటుకున్నాడు. ఎంతో మంది రోగులని ఆసుపత్రులకి ఉచితంగా తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ విషయాన్ని గమనించిన హాస్పటల్ సిబ్బంది వైద్యులకి ఈ విషయం తెలియచేశారు. దాంతో వైద్యులు , సిబ్బంది అతడికి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నారు...

IHG

ఎప్పటిలానే అతడు రోగిని హాస్పటల్ కి తీసుకు వచ్చి తాను లోపాలకి వెళ్తున్న క్రమంలో ఎంట్రీ దగ్గరనే ఉన్న వైద్యులు. సిబ్బంది అందరూ ఒక్క సారిగా చప్పట్లతో స్వాగతం పలికారు. ఏమి జరుగుతుందో అర్థం కాని అతడు అలానే ఉండిపోయాడు. ఆ స్వాగతం తనకేనని తెలుసుకున్న అతడు అలా సైలెంట్ గా నించుని చూస్తూ ఉండిపోయాడు. కేవలం చప్పట్లతో సరిపెట్టకుండా ప్రశంసిస్తూ ఓ పత్రాన్ని..కొంత డబ్బు అందించారు. దాంతో ఒక్క సారిగా అతడు భావోద్వేగానికి లోనయ్యాడు..ఈ ఘటన తాలుకూ వీడియో వైరల్ ప్రస్తుతం నేట్టింట్లో వైరల్ అవుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: