కరోనా అనే పేరు వింటే చాలు అమెరికా ప్రజలు కంగారు పడిపోతున్నారు. ఎక్కడా లేని భయం వారిలో ఆవరిస్తోంది. ఒక్క అమెరికా ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే అమెరికాలో దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రజలకి కంటిమీద కునుకు ఉండటంలేదు. ఈ వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టిందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తున్న ప్రతీ సారీ కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఒక్క కరోనా దెబ్బకే అమెరికా అల్లాడి పోతుంటే..త్వరలో కరోనాకి తోడుగా మరొక మహమ్మారి కూడా జతకట్టనుందట..

IHG

అమెరికాలో వచ్చేది ఫ్లూ సీజన్..ఈ సీజన్ అంటేనే అమెరికా ప్రజలకి కంటి మీద కునుకు ఉండదు. కరోనా గనుకా ఫ్లూ తో జతకడితే మాత్రం విలయమే జరుగుతుందని..కరోనా ఆ సమయంలో తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే కరోనా కారణంగా అమెరికా తీవ్రమైన నష్టంలో ఉంది..సుమారు 50వేల మంది ప్రాణాలు కోల్పోయారు..లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఫ్లూ ఎంట్రీ ఇస్తే ఈ లెక్కలు మరింత పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

IHG

డైరెక్టర్ ఆఫ్ ది సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఫర్ ప్రేవెంక్షన్ డాక్టర్ రెడ్ ఫీల్డ్ అమెరికాకి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు..గతంలో అంటే 2019 లో ఫ్లూ సృష్టించిన విలయం అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఏకంగా ఒక ఏడాదిలో రెండు సార్లు ఫ్లూ అమెరికాపై దాడి చేసింది. ఈ దాడి గనుకా మరో మారు అంటే ప్రస్తుతం కరోనా తో గనుకా కలిసి చేస్తే ఊహించడానికి కూడా  అంచనాలు అందవని..ఆ దెబ్బ ఇప్పట్లో అమెరికాకి కోలుకునే అవకాశాలు ఇవ్వదని అంటున్నారు. ఆర్ధికంగా, ఆహార కొరతలు, నిరుద్యోగం ఇవన్నీ అమెరికాకి అతిపెద్ద సవాళ్లుగా నిలుస్తాయని హెచ్చరిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: