ప్రపంచ వ్యాప్తంగా సమాజం ఎదుర్కుంటున్న ప్రధానమైన సమస్య లైంఘిక వేధింపులు. చిన్న, పెద్ద అనే తేడా లేదు, ముసలి ముతక అనే భేదం లేదు..కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవలకి ఇలాంటివి ఏమి కనపడవు. దాంతో ఎన్నో ఘోరాలు జరిగిపోతున్నాయి..విచ్చలవిడిగా సెల్ ఫోన్ అందుబాటులో ఉంటున్నాయి కావాల్సినవి అన్నీ చూసేస్తున్న చిన్న పిల్లలు సైతం  వాయి వరసా కూడా మర్చిపోయిన దారుణాలకి పాల్పడుతున్నారు. ఫలితంగా చిన్న తనంలోనే ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి ఘటనే లండన్ లో చోటు చేసుకుంది.

IHG

దేశం కాని దేశంలో ఉంటున్న ఓ భారతీయులు ఎవరైనా తప్పు చేస్తే ఆ నింద కేవలం వారికి మాత్రమే పరిమితం అవ్వదు. అతడు ఏ దేశానికి చెందిన వాడో ఆ దేశం కూడా ఆ నిందని మోయాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది...లండన్ లో ఉంటున్న మిహిర్ అగర్వాల్ అనే 22ఏళ్ళ భారతీయ యువకుడు స్థానికంగా ఉన్న ఓ బాలికపై కన్నేశాడు. ఆమెతో స్నేహం కలిపాడు...సరదాగా మాట్లాడుతూ ఆమెకి దగ్గర అయ్యాడు..ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు..ఇలా కొంత కాలం గడిచింది..దాంతో అతడి వికృత చేష్టలు మొదలయ్యాయి..

IHG

ఫోటోలు, వీడియోలు పంపమని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చే వాడు. చాటింగ్ సమయంలో ఎంతో అసభ్యంగా ప్రవర్తించేవాడు..చాలా ఓపిక పట్టిన ఆ బాలికకి అతడి చేష్టలతో చిర్రెత్తు కొచ్చి తన ఇంట్లో ఈ విషయం చెప్పేసింది..దాంతో బాలిక పేరెంట్స్ స్థానికంగా ఉన్న  స్కాట్లాండ్ యార్డ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని అతడి సెల్ ఫోన్ లో చాటింగ్ పరిశీలించారు. ఫిర్యాదు చేసినట్లుగా అందులో అంతా అసభ్యకరమైన చాటింగ్ ఉండటంతో పోలీసులు సాక్ష్యాధారాలతో సహా కోర్టులో అతడిని హాజరుపరిచారు. దాంతో కోర్టు అతడికి రిమాండ్ విదిస్తూ తీర్పుని మే 20 కి వాయిదా వేసింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: