నిజంగా.. ఈ వార్త రాసే నేను.. చదివే మీరు ఎంతో అదృష్టవంతులు.. ఎందుకంటే ఈ లాక్ డౌన్ సమయంలో కూడా మనకు వార్త రాసే చదివేంత ఓపికని ఇచ్చాడు.. అలా ఓపికగా ఉండడానికి మనకు మూడు పూటలా మంచి భోజనం లభిస్తుంది.. కానీ లాక్ డౌన్ అనేది అందరికి ఒకేలా ఉండదు.. 

 

ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది ఉపాధి పోగొట్టుకున్నారు.. ఎంతోమంది పిల్లలు కరోనాతో కంటే కూడా ఆకలితోనే మరణిస్తున్నారు. ఈ మాయదారి రోగం పర్యావరణాన్ని కాపాడిన.. బంధాలను దగ్గర చేసిన.. ఎంతోమంది ప్రజల కడుపును కొడుతుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే మన కళ్ళ నుండి నీళ్లు వచ్చేలా ఓ ఘటన జరిగింది.. 

 

ఆ ఘటన చూస్తే ఎవరైనా సరే కన్నీళ్ల్లు పెట్టుకుంటారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళకు ఎనిమిది మంది పిల్లలు.. భర్త చూస్తే ఓ దోపిడీదారు చేతిలో హత్యకు గురయ్యాడు.. ఆ 8 మంది పిల్లలతో కరెంటు, నీళ్లు లేని ఓ ఇంట్లో ఆ మహిళా బిక్కు బిక్కుమంటూ కాలం వేలాధిస్తోంది.. ఇన్నాళ్లు ఆమె ఎవరో ఒకరి ఇంట్లో పని చేసి పిల్లలకు ఆహారం పెట్టేది.. 

 

కానీ కరోనా మాయ రోగం అక్కడ వచ్చింది.. దీంతో లాక్ డౌన్ అమలు చేసారు.. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి అన్నారు.. ఇంకా ఏం చేస్తుంది.. ఇంట్లోనే ఉంది.. ఇంట్లో పిడికెడు తిండి గింజలు కూడా లేవు.. పిల్లలు చూస్తే ఆకలి ఆకలి అని ఏడుస్తున్నారు.. ఏం చెయ్యాలో తోచలేదు.. అప్పుడే ఆమె ఓ పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో రాళ్ళూ వేసి ఉడికించింది.. 

 

అలాగైనా అమ్మ ఏదో వండుతుంది అనే ఆశతో పిల్లలు ఏడుపు ఆపుతారు అని.. ఈ గుండెలు పిండే ఘటన కెన్యాలోని మోంబసా కౌంటీలో గల ఓ గ్రామంలో వెలుగుచూసింది. అయితే పిల్లల ఏడుపు విన్న పొరుగింటి వ్యక్తి అక్కడికి వెళ్లి చూస్తే ఇది జరుగుతుంది.. ఆ కుటుంబ డయనీయస్థితిని మీడియా ముందుకు తీసుకెళ్లాడు. 

 

అంతే బయటి ప్రపంచం అంత అది చూసి చెలించిపోయింది.. దీంతో కెన్యా ప్రజలు, ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బు లు వేస్తున్నారు. ఆమెకు ఫోన్ చేసి ఎం సాయం కావాలన్నా చేస్తామని చెబుతున్నారు.. దేశ ప్రజలు తనకు ఇంతలా సాయం చేస్తారు అని ఊహించలేదని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.. కథ సుకాంతం అయ్యింది. ఈ కథకు శుభం జరిగింది.. మరి మిగితావి? ఎన్నో కథలు మీడియాకు తెలియనివి ఉన్నాయి.. మీ చుట్టూ పక్కల కూడా ఎవరో ఒకరు ఇబ్బంది పడుతుంటారు.. అలాంటి వారికీ మీకు తోచిన సాయం చెయ్యండి.. మంచి మనసును చాటుకొండి.. కష్టకాలంలో ఆదుకొని దేవుడవ్వండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: