కరోనా పేరుతో చెప్తేనే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు భయభ్రాంతులకి గురవుతున్నారు. ముఖ్యంగా కరోనా దెబ్బకి అమెరికా వంటి అగ్ర రాజ్యమైతే ఇప్పటికి కోలుకునే పరిస్థితిలో కనపడటంలేదు. లక్షలాది మంది అమెరికా ప్రజలు ఈ వైరస్ బారిన పడగా..లక్షకి చేరువలో మృతులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్ అలసత్వంపై  తీవ్రస్థాయిలో మండిపడుతున్న అమెరికా ప్రజలు ట్రంప్ పై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని తెలుస్తోంది. అసలే పుట్టెడు కష్టాలలో ఉన్న ట్రంప్ కి తాజాగా మరొక విపత్కర పరిస్థితి ఎదురయ్యింది.

IHG

రిక్ బ్రైట్ అనే ఓ ప్రజా వేగు తాను  ముందుగానే కరోనా పై హెచ్చరికలు చేశానని కానీ అధికార యంత్రాంగం కానీ ట్రంప్ కానీ తన మాటలు పట్టించుకోలేదని తాజాగా ఓ బాంబు పేల్చాడు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు అమెరికా ఏజెన్సీ నుంచీ తొలగించబడిన ఓ కీలక ఉద్యోగి ఈ ఆరోపణలు చేయడంతో ట్రంప్ మళ్ళీ ఇరకాటంలో పడ్డాడు. తాను జనవరి లోనే ఈ వైరస్ గురించి హెచ్చరికలు చేశానని అమెరికా ఆరోగ్య సేవల అధికారి అలెక్స్ అనే అధికారి పట్టించుకోలేదని కాగా తనపై విమర్శలు చేశారని ఆయన ఫిర్యాదు చేశారు.

IHG

ఇదిలాఉంటే బ్రైట్ ని తొలగించడంపై స్పందించిన బ్రైట్ తరుపు న్యాయవాది ప్రజలని రక్షించే ప్రజావేగులని తొలగించడం చట్టరీత్యా నేరమని వాదించారు. సదరు సంస్థపై కోర్టులో పిటీషన్ వేశారు. దాంతో ఈ విషయంపై స్పందించిన సంస్థ అతడిని మరొక ప్రాంతానికి బదిలీ చేస్తున్నామని ప్రకటించింది. అయితే తనకి జరిగిన అన్యాయంపై అలాగే అమెరికా ప్రజలని కాపాడలేక పోవడంలో ట్రంప్ ప్రభుత్వం ఎలా విఫలమయ్యింది అనే విషయాలని ప్రతినిధుల సభలో స్వయంగా చెప్పనున్నాని బ్రైట్ తెలిపారు. కాగా తాజా పరిణామాలపై కేవలం ప్రజలు డెమోక్రటిక్ పార్టీ నేతలు మాత్రమే కాదు సొంత పార్టీ రిపబ్లికన్స్ సైతం ట్రంప్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ రిపబ్లికన్స్ కి ఇదే స్థాయిలో ట్రంప్ పై అభిప్రాయం కొన్ని రోజులు ఉంటే ట్రంప్ వైఫల్యాల వైపు ప్రయానించక తప్పదని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: