అగ్ర రాజ్యం కరోనా దెబ్బకే అల్లాడి పోతోంది. ఊహించని రీతిలో ఈ కరోన మహమ్మారి అమెరికాని అతలాకుతలం చేస్తోంది. ఒక పక్క ఉద్యోగాలు లేక, చేతిలో చిల్లి గవ్వ లేక ఎంతోమంది ఆర్ధిక కష్టాలని అనుభవిస్తున్నారు. కళ్ళ ముందే కుటుంభ సభ్యులు, సన్నిహితులు కరోన తో ప్రాణాలు పోగొట్టుకుంటుంటే చూస్తూ ఉండటమే తప్ప ఏమి చేయాలని పరిస్థితి. అయితే ఈ వైరస్ చిన్న పిల్లలపై ప్రభావం పెద్దగా చూపకపోవడంతో ఒకింత సంతోషం వ్యక్తం చేస్తున్న తల్లి తండ్రులకి మరో పిడుగులాంటి వార్త వినిపించింది.

IHG

అమెరికాలో కొత్త వైరస్ విలయతాండవం చేస్తోందని. ఇది కేవలం చిన్న పిల్లలపై మాత్రమే ప్రభావం చూపుతోందని ఈ వైరస్ సోకిన పిల్లలకి రక్త నాళాలలో వాపు రావడం, పొత్తి కడుపులో నొప్పి, వాంతులు రావడం జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ వ్యాధి కేవలం చిన్న పిల్లలో వస్తోందని అంటున్నారు. అయితే ఇది కూడా కరోనా సంభదిత వ్యాధిలా ఉందని అంటున్నారు నిపుణులు..ఇదిలాఉంటే ఈ కొత్తరకం వ్యాధికి..మిస్టీరియస్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు. ఇప్పటికే కరోనా దెబ్బకే అమెరికన్స్ ఆందోళన చెందుతుంటే తాజాగా ఈ వైరస్ సోకడం మరొంత ఆందోళన చెందేలా చేస్తోందని నిపుణులు అంటున్నారు. అయితే

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CORONAVIRUS' target='_blank' title='coronavirus-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>coronavirus</a> symptoms tend to be mild, except for ...

ఈ వ్యాదికి కరోనాకి సంభాధం ఉందా లేక వేరే వ్యాధి సోకిందా అనే కోణంలో పరిశోధనలు జరుపుతున్నారు పరిశోధకులు. ఈ వ్యాధిని మొదట్లోనే అదుపు చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అమెరికాలో ఇప్పటికే కరోనా ప్రకంపనలు సృష్టిస్తుంటే కొత్తగా ఈ వ్యాధి ప్రభలడం ఎంతో ఆందోళన చెందుతున్నారు అమెరిక ప్రజలు. అయితే  ఈ వ్యాధి ఇప్పటికే ఎంతో మంది పిల్లలో ఉందని ప్రస్తుతానికి ప్రాణ నష్ట లేకపోయినా సరైన చర్యలు చేపట్టకపోతే మాత్రం ప్రమాదమే అంటున్నారు పరిశోధకులు..ఇదిలాఉంటే ఇది అమెరికాపై ప్రయోగించిన మరొక బయో వెపన్ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అమెరికన్స్ కరోనా మాదిరిగానే ఇది కూడా బయో వెపన్ లో భాగమే అనే సందేహంతో ఆందోళన చెందుతున్నారు..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: