కరోనా మహమ్మారి అమెరికా కలలో కూడా ఊహించని రీతిలో పెను సంక్షోభాన్ని మిగిల్చింది. ఈ వైరస్ సృష్టించిన విపత్తు అమెరికా చరిత్రలో మొట్టమొదటి కావడం గమనార్హం. ఇప్పటి వరకూ ఈ వైరస్ ధాటికి 80 వేల మంది అమెరికా ప్రజలు చనిపోగా...13 లక్షల మంది అమెరికన్స్ ఈ వైరస్ బారిన పడ్డారు. ఒక పక్క నిరుద్యోగం..మరో పక్క ఆర్ధిక మాంద్యం..ఉద్యోగాలు లేక చేతిలో డబ్బు లేక ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది అమెరికా ప్రజలు..అన్ని సమస్యలు అధ్యక్షుడు ట్రంప్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

 

ఈ పరిస్థితుల నుంచీ అమెరికాని బయట పడేయడానికి ట్రంప్ భారతీయ సనాతన సంస్కృతీ సాంప్రదాయాలని అనుసరిస్తున్నారు..భారత దేశాన్ని కోట్ల ఏళ్ళుగా కాపాడుతున్న  వేదాల సారం గురించి తెలుసుకున్న ట్రంప్ శ్వేత సౌధంలో “వేద పఠనం” చేయించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక్క సారిగా అమెరికా ప్రజలని ఆశ్చర్యపరిచింది..అంతేకాదు అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది భారతీయులకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది..భారత దేశం ఈ చర్యలకి గర్వ పడింది..

 

భారత దేశం కరోనా ధాటిని ఎలా తట్టుకుంది..అక్కడి ప్రజలు కరోనా బారిన పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు..అలాగే కారోనా నుంచీ దేశాన్ని రక్షించమని దేవుడికి చేస్తున్న వేద మంత్రాల హోమాలు అన్నీ గమనించిన వైట్ హౌస్ తమవద్ద కూడా వేదం మంత్రాలని పఠనం చేసేలా చర్యలు తీసుకుంది అందుకు తగ్గట్టుగా అమెరికాలోనే ఉంటున్న  హరీస్ బ్రహ్మభట్ అనే వేద పండితుడిని వైట్ హౌస్ కి పిలిపించుకుని యజుర్వేడంలోనే ఓ భాగాన్ని పటించేలా ప్రార్ధన చేయించుకుంది. అంతేకాదు ఆ భాగాన్ని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసుకున్నారు అమెరికన్స్..

 

భారత దేశ వేదాల యొక్క గొప్పతనాన్ని అగ్ర రాజ్యం ప్రచారం చేయడం ప్రస్తుతం ప్రపంచ దేశాలని ఆలోచింప చేసేలా ఉందని అంటున్నారు నిపుణులు. అమెరికా ప్రజల ఆరోగ్యం కోసం, వారి రక్షణ కోసం వేదం పటనం చేయించినట్టుగా వైట్ హౌస్ ప్రతినిధి తెలిపారు. అక్కడ స్థానికంగా ఉన్న స్వామి నారాయణ మందిర్ పూజారి హరీస్ బ్రహ్మ భట్ స్వయంగా వైట్ హౌస్ వెళ్లి వేదాలు చెప్పడం అమెరికాలోని అమెరికన్స్ మాత్రమే కాదు..యావత్  భారత దేశ ప్రజలు అందరూ ఎంతో సంతోష పడుతున్నారు..ఈ వేడుకలో ట్రంప్ సైతం పాల్గొనడం మరొక విశేషం..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: