అమెరికా వ్యాప్తంగా కరోనా దెబ్బకి వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మందికి కరోనా సోకి ప్రాణాలతో కొట్టి మిట్టాడుతున్నారు. రోగులు లక్షల్లో ఉంటే వైద్యులు వేలల్లో ఉంటున్నారు. దాంతో సరైన వైద్య సేవలు అందక పోవడంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు లెక్కకి మించే ఉన్నారు. వైద్య పరీక్షలు చేయడానికి డాక్టర్లు ఉన్నా నిత్యం సేవలు అందించడానికి నర్సులు సరిపడా లేరని తెలుస్తోంది.  ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది..దాంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది..

IHG

ప్రస్తుతం అమెరికా ఉన్న ఈ అత్యవసర పరిస్థితులలో వైద్యులు, నర్సుల అవసరం ఎంతైనా ఉందని గ్రహించిన చట్టసభ ప్రతినిధులు అందుకు తగ్గట్టుగా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకూ వినియోగించని 40 వేల గ్రీన్ కార్డులని వివిధ దేశాలకి చెందినా నిపుణులైన వైద్యులు, నర్సులకి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టనున్నారు. అందుకు తగ్గట్టుగా అమెరికా కాంగ్రెస్ లో బిల్లుని ప్రవేశ పెట్టనున్నారు.

IHG

ఈ గ్రీన్ కార్డులు జారీ చేయడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అమెరికా పొందుతారని, మరింత మంది రోగులకి వైద్యులు సేవలు అందించడానికి వీలు ఉంటుందని తెలిపారు. ఈ గ్రీన్ కార్డులు వారికి జారీ చేయడం ద్వారా అమెరికాలో శాశ్వతంగా 40 వేల మంది వైద్యులు ఉండిపోతాని తెలిపారు. ఈ బిల్లుకి గనుక ఆమోదం లభిస్తే దాదాపు 25 వేల మంది నర్సులు...15 వేల మంది డాక్టర్ల కి గ్రీన్ కార్డు దక్కనుంది. అంతేకాదు ఇవి జారీ చేయడం ద్వారా వైద్యులు , నర్సులు రెట్టించిన సంతోషంతో పనిచేస్తారని అంచనా వేస్తున్నారు. ఇదిలాఉంటే ఈ ప్రక్రియ గనుకా వేగవంతం అయ్యి ఆమోదింపబడితే భారతీయ డాక్టర్లు, నర్సులకి పూర్తిస్థాయిలో ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: