దేశంలో కరోనా తో ఎంతో మంది పోరాటం చేస్తున్నారు. పేద ప్రజల కోసం స్వచ్ఛంద సంస్థలు.. ఎన్ఆర్ఐ లు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.  దేశంలో ఇప్పటి వరకు ఎంతో మంది పేదలు వలస కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  ఈ నేపథ్యంలో రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన వారు.. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు.. కొంత మంది ఉద్యోగస్తులు చందాలు వేసుకొని విరాళాలు ఇస్తూ ఎంతో సహాయం చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికాలోని నాట్స్ వారు తమకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. 

 

గత కొన్ని రోజుల నుంచి ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ ఎంతో దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.  ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోవారి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు.  తాజాగా ఇప్పుడు  అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్.. ఇటు తెలుగునాట కూడా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు  పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఉదారంగా ముందుకొస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ గుంటూరు జిల్లాలోని వేటపాలెం, కొత్తపల్లి, నారికేళ్లపల్లి గ్రామాల్లో 200 పేద కుటుంబాలకు నాట్స్ నిత్యావసరాలను పంపిణీ చేసింది.

 

నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని స్వగ్రామమైన వేటపాలెం లో 150  కుటుంబాలకు నాట్స్సాయం చేసింది. వేటపాలెం గ్రామ నాయకులు అప్పసాని రాజేష్ , రావిపాటి బాబు, రావిపాటి వెంకటేశ్వర రావు ల ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది.  నాట్స్ ఛైర్మన్  శ్రీథర్  అప్పసాని చొరవ మేరకు ఈ గ్రామాల్లో పేద కుటుంబాలకు  ఈ నిత్యావసరా లను అందించడం జరిగింది... వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. 

 

లాక్‌డౌన్‌తో పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో తమ వంతు సేవా సహాయకార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటుందని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని మరియు ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: