గుంటూరు నగరంలో కరోనా నియంత్రణకు పెట్టిన లాక్‌డౌన్‌తో పేద ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  రంజాన్ పండుగ సమయంలో పనులు లేక పండుగ చేసుకోవడం కూడా కష్టమైన తరుణంలో మోహనకృష్ణ మన్నవ ట్రస్ట్, ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ పేద ముస్లింకు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. గుంటూరు నగరంలోని కళ్యాణ్ నగర్, మారుతీ నగర్‌లోని సుమారు 500 పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్‌ను తోఫాగా అందించాయి. పేద ముస్లింల పరిస్థితిని స్థానిక ముస్లిం పెద్దలు నాట్స్ మాజీ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆయన స్పందించి ముస్లింలు పండుగ జరుపుకునేందుకు కావాల్సిన నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు కావాల్సిన సాయం చేశారు.
 
 
తమను పండుగ ఎలా జరుపుకోవాలా..? అనే ఆందోళనతో ఉన్న తమకు నాట్స్, మోహనకృష్ణ మన్నవ చేసిన సాయం మరువలేనిదని స్థానిక ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో స్థానికులైన మస్తాన్ వలి ,బాజీ,స్వరూప్, సాయినాధ్,  అంబరీష్, చైతన్య, సీకే రావు, అఖిల్, అనంత్, చిన్న మీరవాలి, సయ్యద్ మాబు, మాలిక్ రఫీ ఫునిషా, తేజ తదితరులు
పాల్గొన్నారు.
 
సెయింట్ లూయిస్‌లో నిరాశ్రయులకు నాట్స్ ఆహార పంపిణీ :
 
కరోనా విలయతాండవం చేస్తున్న ఈ తరుణంలో పేదలు, నిరాశ్రయులకు విసృత్తంగా సాయం చేస్తోంది. ఈ క్రమంలోనే సెయింట్ లూయిస్‌ లోని డౌన్ టౌన్ లో నాట్స్ 250 మందికి ఆహారాన్ని అందించింది. నిరాశ్రయులు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న నాట్స్ ఈ విషయంలో మానవత్వంతో ముందుకొచ్చి సాయం చేసింది. నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ నాయకులు సుధీర్ అట్లూరి, నాట్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ రమేశ్ బెల్లం, నాట్స్ సెయింట్ లూయిస్ ఛాప్టర్ కో ఆర్డినేటర్ నాగ శ్రీనివాస్ శిష్ట్ల, వైఎస్ఆర్‌కే ప్రసాద్, సురేశ్ శ్రీ రామినేని, నరేశ్ చింతనిప్పు, శ్రీని తోటపల్లి, రమేష్ అత్వాల, అమేయ్ పేటే,  రఘు పాతూరి తదితర నాట్స్ ప్రతినిధులు ఈ ఆహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
IHG
 
శ్రీ చరణ్ మంచికలపూడి, శ్రీరామ్ మంచికలపూడి, ఆదిత్య శ్రీరామినేని తదితర విద్యార్థి బృందం ఇందులో పాల్గొని తమ సేవా పథాన్ని చాటింది. సిగ్నేచర్ ఇండియా రెస్టారెంట్ ఈ ఆహారాన్ని తయారుచేసేందుకు తమవంతు సహకారం అందించింది. సిక్స్ ఆఫ్ ఎస్టీఎల్ టీం కూడా నిరాశ్రయులకు ఆహారం అందించేందుకు తన వంతు సాయం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: