ప్రపంచంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ పెరిగిపోతూ ఉంది.   ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక దేశాన్ని వదిలేస్తే మరో దేశాన్ని కరోనా వెంటాడుతుంది. ఇప్పుడు భారత్ రష్యా బ్రెజిల్ దేశాల్లో కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి.  ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్ని కరోనా కేసులు ఉన్నాయో.. అందులో మూడో వంతు అమెరికాలోనే నమోదు అయ్యాయి.. మరణాల సంఖ్య కూడా ఇక్కడే ఉన్నాయి.  ఆ తర్వాత రష్యా లో కూడా ఇప్పుడు కరోనా మరణాలు, కేసులు పెరిగిపోతున్నాయి.   దేశంలో కరోనా కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో సామాన్య ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి.  ఈ నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు.. సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు.

 

కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగునాట విస్తృతంగా కృషి చేస్తోంది. తాజాగా  ఈ క్రమంలోనే నాట్స్..  తెలంగాణలోని బోధన్‌లో నిత్యావసరాలను పంపిణీ చేసింది. బోధన్ మునిసిపాలిటీలోని  పేదలు లాక్‌డౌన్‌తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని స్థానికులు నాట్స్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన స్పందించి బోధన్‌లో నిత్యావసరాలు పంపించేందుకు చర్యలు చేపట్టారు. నాట్స్  ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ నాయకులు కిశోర్ వీరగంధం, గోపి కృష్ణ పాతూరి, శశాంక్ కోనేరు తదితరుల సాయంతో బోధన్‌లో నిత్యావసరాలు పంపేందుకు కావాల్సిన సాయం చేశారు.

 

దీంతో  బోధన్ పట్టణంలోని ఏకచక్ర నగర్‌లోని 150 కుటుంబాలకు నిత్యావసరాలు అందించడం జరిగింది. కరోనా కష్టకాలంలో మానవత్వంతో ముందుకొచ్చి సాయం చేసిన నాట్స్ నాయకులను స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు తూమూ శరత్ రెడ్డి ప్రశంసించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో స్థానిక నాయకులు గుమ్ముల ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అశోక్ రెడ్డి ,మున్సిపల్  కౌన్సిలర్ ధూప్ సింగ్, గుమ్ముల శంకర్ రెడ్డి ,సాయి రెడ్డి , శంకర్ రెడ్డి గుమ్ముల (డ్రెస్సెస్ ),ప్రకాష్ రెడ్డి ,శివకుమార్ ,విశాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: