అమెరికాలో అత్యంత అమానుషంగా చంపబడిన జార్జ్ ఫ్లాయిడ్ కి మద్దతుగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం విధితమే. అమెరికా అధ్యక్షుడి తీరుపై అమెరికా వ్యాప్తంగా మాత్రమే కాకుండా బయట దేశాల ప్రజల నుంచీ కూడా నిరసనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సంఘటన తరువాత ట్రంప్ అనుసరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. జార్జ్ ని హత్య చేసిన పోలీసుపై కటినమైన చర్యలు తీసుకోవాలని హక్కుల సంఘాలు..నిరసన కారులు ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలోనే సదరు పోలీస్ అధికారికి అతడి భార్య షాక్ ఇచ్చింది..

IHG's death ...

జార్జ్ ని చంపిన పోలీస్ అధికారి పేరు డెరెక్ చౌవిన్. డెరిక్ జార్జ్ ని హత్య చేసిన తరువాత అతడి భార్య కీలై తన ఇలాంటి భర్తతో నేను ఉండలేను దయచేసిన నాకు విడాకులు ఇప్పించండి అంటూ గతంలోనే  కోర్టును ఆశ్రయించింది. అయితే మళ్ళీ తాజాగా మరొక సంచలన నిర్ణయం తీసుకుంది కీలై . తన పేరులో చివరి పదమైన  చౌవిన్ అనే పేరును తొలగించాలని ఇందుకు న్యాయస్థానం తనకి న్యాయం చేయాలని మరొక పిటిషన్ వేసింది. అంతేకాదు విడాకుల పత్రాలలో సైతం ఆ పేరు ఉండకూడదని అభ్యర్ధించింది.

IHG

తన భర్త నుంచీ విడిపోవాలని జార్జ్ మరణం తరువాత అనుకున్నానని అప్పుడే అతడితో పూర్తిగా సంభంధాలు తోలిగిపోయాయని ప్రకటించింది. అంతేనా ఇప్పటి వరకూ ఇద్దరి పేరు మీద ఉన్న ఆస్తి పాస్తులు అన్నీ ఇద్దరికీ సమానంగా చెందేలా పంచాలని మరొక పిటిషన్ వేసింది. విడాకులు ఇచ్చిన తరువాతా తానూ ఒంటరి జీవితం గడుపుతానని ఇలాంటి వాడితో ఉండలేనని. తననుంచీ శాశ్వతంగా విడదీయమని అభ్యర్ధించింది. ఇదిలాఉంటే చౌవిన్ ,కీలై 2010 లో పెళ్లి చేసుకున్నారు. వారు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని తెలుస్తోంది. ఆమె చేసిన ఈ పనికి అమెరికా వ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: