డబ్బుంటే కొండ మీద ఉన్న కోతి అయినా దిగి వస్తుందని అంటారు..ఇదో నానుడి సామెత..కానీ లక్కుంటే..కలిస్తోస్తే కొండే కిందకి వంగుతుంది అనేది నేటి సామెత. అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరికీ తెలియదు కానీ ఒక్క సారి అది తలుపుతడితే ఎలాంటి వాడికైనా స్టార్ గిర్రున తిరగాల్సిందే. అ లాంటి లక్కున్న భారతీయుడు గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అబుదాబిలో ఓ బేకరీలో రోజు కూలిగా  పని చేస్తున్న ఓ భారతీయుడు ఇప్పుడు సదరు బేకరీ ఓనర్ కంటే కూడా ధనవంతుడుగా మారిపోయాడు.

 

కేరళ రాష్ట్రానికి చెందిన అస్సేన్ ముజ్జిప్పురత్ అనే వ్యక్తి ఎన్నో ఏళ్ళ క్రితమే అబుదాబి వెళ్ళాడు. అక్కడ ఒక బేకరీలో పని చేస్తూ తానూ సంపాదించిన దానిలో కొంత ఉంచుకుని తన కుటుంభానికి పంపేవాడు. ఇలా దాదాపు 28 ఏళ్ళుగా అబుదాబిలో పనిచేస్తున్నాడు. అయితే సంపాదించిన సొమ్ము మాత్రం వెనకేసుకోవడానికి లేకుండా పోయేది. అయితే అతడికి లాటరీ టిక్కెట్స్ కొనడం అలవాటు. ఇప్పటి వరకూ 4 సార్లు టిక్కెట్లు కొని తన అదృష్టాని పరీక్షంచుకోవాలని ప్రయత్నించినా అదృష్టం తలుపు తట్టలేదు. దాంతో మరో సారి టిక్కెట్టు కొనుకున్నాడు..ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తి అబుదాబిలో అధికంగా ఉండటంతో కేరళలో ఉండటానికి వచ్చాడు. ఈ సందర్భంలోనే అబుదాబి నుంచీ వచ్చిన ఒక ఫోన్ కాల్ అతడి జీవితాని మార్చేసింది.

 

అతడు కొన్న లాటరీ టిక్కెట్టు సంస్థ ఫోన్ చేసి మీరు 12 మిలియన్ దిర్హామ్స్ గెలుచుకున్నారని తెలిపింది. ఈ మొత్తం విలువ 24 కోట్లు. దాంతో ఒక్క సారిగా అతడు షాక్ అయ్యాడు. తనని ఎవరో ఫోన్ చేసి ఏడిపిస్తున్నారని అనుకున్నానని ఇది నిజమని నేను ఇప్పటికీ నమ్మలేక పోతున్నానని అన్నాడు. అబుదాబి వెళ్లి ఈ సొమ్ముని తీసుకుంటానని. కొంత భాగం పేదల కోసం ఖర్చు చేస్తానని వారి బాధలు ఎలా ఉంటాయో తనకి తెలుసునని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: