అగ్ర రాజ్యంలో భారత ఆర్ధిక దౌత్యవేత్తగా తెలుగు ఐఏఎస్ అధికారి 1993 బ్యాచ్ కి చెందిన కోట రవి కి దక్కింది. సిక్కోలు వాసిగా ఉన్న రవి ఇప్పుడు అగ్ర రాజ్యంలో కీలక పదవిలో ఉండబోతున్నారు అనే వార్త ఆయన సొంత ప్రాంత వాసులని ఎంతో సంతోషాన్ని ఇస్తోందని అంటున్నారు సిక్కోలు ప్రజలు. కేంద్ర క్యాబినెట్ రవికి ఈ భాద్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. సొంత బొమ్మాలి మండలం కోట పాడుకి చెందిన రవి ప్రస్థానం ఒక్క సారి పరిశీలిస్తే..

 

ప్రాధమిక విద్య మొదలు హైస్కూల్ విద్య వరకూ చుట్టుపక్కల గ్రామాలలో చదివిన రవి. కాలేజీ విద్యని టెక్కలి ప్రభుత్వ కాలేజీలో చదివారు. బాపట్ల వ్యవసాయ కాలేజీలో డిగ్రీ పీజీ కూడా చదివారు. ఆ తరువాత న్యూ ఢిల్లీ లోని అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో చదివారు. ఐఏఎస్ కావాలనే మక్కువతో 1993 లో ఎంపిక అయ్యారు .అసోం బోలోగాడ్, జోర్హాట్ , జిల్లాలకి కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. ఆయన ప్రతిభకి తగ్గట్టుగా ఉన్నత పదవులు కూడా అలంకరించారు.

 

అస్సాం ప్రభుత్వంలో ఫైనాన్స్ కార్యదర్శి గా విధులు నిర్వర్తించారు. అసోం లోనే అర్బన్ ప్రాంతాలలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, అండమాన్ లకు భారత ఆహార సంస్థ సీనియర్ రెసిడెన్షియల్ మేనేజర్ గా భార్యతలు నిర్వర్తించారు. ఢిల్లీ లో గనుల శాఖా మంత్రి కి ఓఎస్డీ గా పనిచేశారు. ప్రస్తుతం కోట రవి 15వ ఆర్ధిక సంఘం సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తాజగా కేంద్ర క్యాబినెట్ నిర్ణయం ప్రకారం అగ్ర రాజ్యానికి భారత ప్రత్యేక దౌత్యవేత్తగా నియమితులు అయ్యారు. ఒక తెలుగు వ్యక్తికి అందులోనూ మా ప్రాంత వ్యక్తికీ అమెరికాలో ఇలాంటి గౌరవం దక్కడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని స్థానిక ప్రజలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: