పోలీసు వ్యవస్థ అనేది ప్రజలకి ఎలాంటి హాని జరిగినా..ప్రజలకి అన్యాయం జరిగినా తక్షణమే స్పందించి వారికి న్యాయం జరిగేలా చూడగలగాలి. అప్పుడే ప్రజల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన పోలీసు వ్యవస్థకి నిజమైన అర్థం. కానీ అదే పోలీసు ప్రజలపై ఉక్కుపాదం మోపుతూ అధికారాన్ని ఉపయోగించి అమాయకపు ప్రజల ప్రాణాలని తీసేస్తుంటే పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలోచనే అమెరికాలోని వాషింగ్టన్ లో గల  మినియా ప్రాంత పాలకులకి తట్టింది...ఈ క్రమంలోనే

 

మినియాపోలీస్ వ్యవస్థని రద్దు చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ డిమాండ్ ని అక్కడి నగర మండలి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. సుమారు 12 మంది సభ్యులు గల మండలిలో దాదాపు 9 మంది సభ్యులు అందుకు అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరి స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రజలకి మరింతగా సేవలు చేస్తూ వారికి నమ్మకాన్ని కలిగించేందుకు సరికొత్త భద్రతా వ్యవస్థని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ మృతి పట్ల తీవ్ర ఆవేదన చెందిన సభ్యులు ఓ పార్క్ లో సంతాపం తెలిపుతూ అక్కడికి వచ్చిన ప్రజలని ఉద్దేశించి లీసా బెండర్ ఈ నిర్ణయాన్ని ప్రజలముందు ఉంచారు..

 

ప్రస్తుతం మనకి ఉన్న పోలీసు వ్యవస్థ మనకి పూర్తి  స్థాయిలో భద్రతని కల్పించలేక పోతోంది అనేది వాస్తవం మనల్ని సురక్షితంగా ఉంచుతూ మనకోసం పనిచేసే మరొక బద్రతా వ్యవస్థని సృష్టించుకుందాం అంటూ ఆమె ప్రకటించారు. ఎంతో కాలంగా మినియా పోలీసులు స్థానికంగా ఉన్న ప్రజలపై జులుం చేస్తున్నారని, ఎన్నో ఇబ్బందులకి గురిచేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దాంతో మినియా పోలీసు వ్యవస్థని రద్దు చేయడం తప్పదని తెలుస్తోంది. న్యూయార్క్ లో 2012 లో కూడా ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు అక్కడి పోలీసు వ్యవస్థని రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: