కొంతమందికి అదృష్టం అరమందాన పట్టి ఉంటుంది. మరి కొందరికి తలుపు తీసేవరకూ కొడుతూనే ఉంటుంది. కానీ ఇంకొందరికి దురదృష్టం జేబూలోనే ఉంటుంది. అలాంటి వాళ్ళు అదృష్టాన్ని కాలదన్ని దురదృష్టాన్ని జేబులో వేసుకుంటారు. మన దైనందిక జీవితంలో ఇలాంటి వాళ్ళు ఎదురవుతూనే ఉంటారు. ఏంటి అదృష్టం , దురదృష్టం అంటూ సూక్తులు చెప్తున్నాము అసలేం జరిగింది అనేగా మీ సందేహం. కేవలం రెండు రోజులు ఆగిఉంటే ఓ వ్యక్తికీ కోట్లాది డబ్బు కష్టపడకుండా తన ఖాతాలోకి వచ్చి కూర్చునేవి కానీ అవేమి పట్టకుండా మూర్ఖంగా వెళ్ళడంతో ఇప్పుడు ఆ మహత్తర అవకాశాన్ని పోగొట్టుకున్నాడు..పూర్తి వివరాలలోకి వెళ్తే...

 

పారిస్ కి చెందిన ఓ వ్యక్తి, అక్కడ ఉన్న సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడు సదరు కంపెనీలో కీలక పదవిలో ఉన్నాడు కూడా అతడి పేరు ఆంటోని జినోన్. లాఫర్జ్ లిమిటెడ్ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే అతడు సింగపూర్ లో ఉన్న బ్రాంచ్ లో పనిచేస్తున్నాడు. ఒక్క సారిగా అతడు తన ఉద్యోగాన్ని మానేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. దాంతో ఓ మంచి ఉద్యోగిని వదులుకోవడం ఇష్టంలేక సదరు కంపెనీ అతడికి ఇంతకంటే పెద్ద ఉద్యోగామిస్తామని ఆఫర్ ఇచ్చింది. ఎన్ని సదుపాయాలూ కావాలన్నా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించింది కూడా కానీ అవేమి అతడు పట్టించుకోలేదు..

 

దాంతో చేసిది లేక అతడికి కోర్టు నోటీసులు పంపించింది కంపెనీ.  దాంతో మళ్ళీ అతడు సింగపూర్ లో పనిచేయడానికి సిద్దపడ్డాడు. ఈ క్రమంలోనే అ కంపెనీ మరొక కంపెనీతో కలిసిపోయింది. దాంతో 2015 ఉద్యోగుల బై అవుట్ ప్రకటించింది. దాంతో ఉద్యోగం వదులుకుంటే తనకి పెద్ద ఎత్తున డబ్బులు వస్తాయని ఊహించాడు ఫ్రెంచ్ ఉద్యోగుల లా ప్రకారం అతడికి సుమారు 2 మిలియన్ డాలర్లు అయిన దక్కుతాయని భావించాడు కానీ ఇక్కడే అతడిని దురదృష్టం వెంబడించింది. రెండు రోజుల క్రితం అతడు సింగపూర్ లో పనిచేయడానికి ఒప్పుకుని చేసుకున్న ఒప్పందం ప్రకారం అతడు ఫ్రెంచ్ లా క్రిందకి రాడని కోర్టు తేల్చి చెప్పింది. సింగపూర్ కంపెనీలో చేరకున్నా బాగుండేది అంటూ లబో దిబో మంటున్నాడు కోట్లు తన దగ్గరవరకూ వచ్చినా తీసుకునే అవకాశం లేకుండా పోయిందంటూ బోరున విలపిస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: