అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నారు ట్రంప్ రాబోయే ఎన్నికల్లో ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకోవడం ఖాయమేనని దాదాపు ఖరారయ్యి పోయింది. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పీక్ స్టేజ్ లో ఉండగా, అమెరికన్స్ కాకుండా ఆదేశంలో జీవిస్తున్న వివిధ దేశాలకి చెందిన ఇండో అమెరికన్స్ సైతం ట్రంప్ వ్యవహార శైలిపై గుర్రుగానే ఉన్నారు. ట్రంప్ తాము ఊహించినంతగా ఏమీ లేరని, రోజు రోజుకి తన అసమర్ధతని బయటపెట్టుకుంటున్నారని అంటున్నారు.

IHG

సిఎన్ఎన్ చానెల్ కోసం ఎస్ఎస్ఆర్ ఎస్ జరిపిన సర్వేలో బయల్పడిన నిజాలు రిపబ్లికన్ పార్టీకి ముర్చెమాటలు పట్టిస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ గత కొంతకాలంలో తమ పార్టీ మళ్ళీ విజయాన్ని అందిపుచ్చుకుంటుందనే అభిప్రాయంలో లేదు. భవిష్యత్తులో ఎలాంటి మార్పులు అయినా రావచ్చు అనుకుంటున్నా నేపధ్యంలో ట్రంప్ చేపడుతున్న చర్యలు ఆ పార్టీ భవిష్యత్తుని చెప్పకనే చెప్పేశాయి. సదరు సర్వే లో ట్రంప్ కంటే బిడెన్ కే ఎక్కువ పాయింట్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వేలో ట్రంప్ కి 41 ఓట్లు రాగా బిడెన్ కి మాత్రం 55 ఓట్లు వచ్చాయని సర్వే తెలిపింది.

IHG

ట్రంప్ కి మద్దతుగా నిలిచినా వారిలో ప్రతీ పది మందిలో ఏడుగురు ట్రంప్ కి తమ ఓటని తెలిపారు..అలాగే కేవలం 27 శాతం మంది ప్రజలు బిడెన్ కి వ్యతిరేకంగా ఓటు వేస్తామని తెలిపారు. బిడెన్ కి చెందిన ఓటర్లలో 3 7 శాతం మంది మాత్రమే ప్రొ బిడెన్ ప్లాన్ కి మద్దతు చెప్పారు. దాదాపు 60శాతం మంది ప్రజలు ట్రంప్ కి వ్యతిరేకంగా ఓట్లు వేస్తామని తెలిపారు. ఇదిలాఉంటే రెండు రోజుల క్రితం ప్రఖ్యాత న్యూస్ చానల్స్ లలో బిడెన్ ముందంజ లో ఉన్నాడని తెలిపాయి. అయితే యువత ఓట్లని బిడెన్ సొంతం చేసుకోలేక పోయారని, యువత చాలా మంది ట్రంప్ కి మద్దతుగా నిలిచారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: