అమెరికాలో అదో పెద్ద రియాలిటీ షో..ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మది టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ఆ షో లో తమ ప్రదర్శనని ఇవ్వాలని ఆరాట పడుతుంటారు. ఈ షో సైతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయ్యింది. ఇప్పటికే ఎంతో మంది ఇండియన్స్ తమదైన ప్రదర్శనతో ఆ షో లో చక్కని ప్రతిభ కనబరించి షో లోని జడ్జస్ కి రోమాలు నిక్కబొడుచుకునేలా ప్రదర్సనలు ఇచ్చారు. దాంతో ఇండియా నుంచీ ఎవరైనా వస్తున్నారంటే వారికి ఎక్కడలేని ఆత్రుత కనిపిస్తుంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ నుంచీ అమెరికాలో ఈ షో కోసం వెళ్ళిన ఇద్దరు అన్నదమ్ములు ఈ షోలో రచ్చ రచ్చ చేశారు..రియల్ గా అన్నదమ్ములు అయిన ఈ ఇద్దరు చూడచక్కని డ్యాన్స్ తో ఆద్యాంతం అందరి నోళ్ళు వెళ్ళబెట్టుకుని చూసేలా ప్రదర్శన ఇచ్చారు..ఆ వివరాలు ఏమిటో మీరు ఓ లుక్కేయండి.

 

రాజస్థాన్ కి చెందిన ఇద్దరు కజిన్స్ అమెరికాలోమాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయిన అమెరికాస్ ఘాట్ టాలెంట్ షో అనే రియాలిటీ షో లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఈ ఇద్దరు అన్నదమ్ములల్లో ఒకరికి 8 ఏళ్ళు మరొకరికి 21 ఏళ్ళు పేద వాడయిన అన్నయ్య సుమారు తనకి 8 ఏట నుంచీ డ్యాన్స్ నేర్చుకుంటున్నట్లుగా తెలిపారు ఇదిలాఉంటే రాజస్తాన్ ఫతే పూర్ కి చెందిన ఈ ఇద్దరు అన్నదమ్ములు అగ్ర రాజ్యంలో ఇచ్చిన ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

 

 

ఈ ఇద్దరి రిధమిక్ డ్యాన్స్, గాలిలో తమ్ముడిని ఎగరేస్తూ పట్టుకుంటూ ఇచ్చిన ప్రదర్శనకి చప్పట్లతో హాల్ అంతా ఊగిపోయింది. దాదాపు అందరూ ఊపిరి బిగబట్టుకుని ఈ ప్రదర్శనని తిలకించారు.  శరీరం ప్లాస్టిక్ సాగినట్టుగా సాగుతూ, ఇనుప చువ్వని  వంచినట్టుగా వంచుతూ వాళ్ళు ఇచ్చిన ప్రదర్శన ఒళ్ళు గగ్గుర్లు పుట్టేలా చేసిందనే చెప్పాలి. రెండు రోజుల క్రితమే జరిగిన ఈ షో  సోషల్ మీడియాలో దాదాపు 4 లక్షలకి పైగా వ్యూస్ సాధించింది 

మరింత సమాచారం తెలుసుకోండి: