అమెరికాలో కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. రోజు రోజుకి కరోనా కేసులు అమెరికాలో పెరుగుతూ వస్తున్నాయి. కేవలం నిన్న ఒక్క రోజునే సుమారు 25 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 1000 మంది వరకూ మరణించారని తెలుస్తోంది. ఇదిలాఉంటే అమెరికా వెళ్లి అక్కడే చదువుకుని స్థిరపడాలని కలలు గన్న ఎంతోమంది ఎన్నారై విద్యార్ధులు తాజా సంఘటనల ద్వారా అమెరికాలో విధ్యాబ్యాసంపై ఎలాంటి మార్పులు ఉన్నాయి. కొత్త విధానాలు ఏమైనా ప్రవేశ పెట్టారా లాంటి ఎన్నో సందేహాలు వారికి కలుగుతున్నాయి..ఈ క్రమంలోనే అమెరకాలో ఉన్న నాట్స్ తెలుగు సంఘం అలాంటి వారి  సందేహాలని నివృత్తి చేయడానికి ఓ వెబ్ నార్ ని ఏర్పాటు చేసింది..

IHG

ఉత్తర అమెరకా తెలుగు సంఘంగా (నాట్స్) అమెరికాలో కరోనా సమస్య వల్ల ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న లేదా కరోనా సోకిన భారతీయులకి తమ వంతు సాయం అందిస్తోంది. పేదల ఆకలి తీర్చడానికి ఫుడ్ డ్రైవ్ ఏర్పాటు చేసింది. కరోనా సమయంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన నాట్స్ తాజాగా విద్యార్ధుల కోసం వారి సందేహాల నివృత్తి కోసం వెబ్ నార్ ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా అమెరికాలో ప్రస్తుత విద్యా విధానం ఎలా ఉంది. ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త విద్యావిధానం ఎలా ఉండబోతోంది..వంటి పలు విషయాలపై నాట్స్ నిపుణులు అయిన వారితో వెబ్ నార్ ఏర్పాటు చేసింది..

 

అమెరికాలో ప్రముఖ విద్యా నిపుణులు యూనివర్సిటీ కన్సల్టెన్సీ ఆఫ్ అమెరికా సిఈవో రాబర్ట్ లివీన్ తో నాట్స్ ఈ ప్రత్యేకమైన వెబ్ నార్ ఏర్పాటు చేసింది. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పిన్నమనేని ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. యూనివర్సిటీలలో ప్రస్తుతం ప్రవేశాలకి ఎలాంటి పరీక్షలు ఉంటాయి, కరోనా నేపధ్యంలో అవి ఎలాంటి మార్పులు సంతరించుకుంటాయి, దరఖాస్తులలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే విధానాలపై ఈ వెబ్ నార్ ఏర్పాటు చేయబడింది. ఈ వెబ్ నార్ లో ఎంతోమంది ఎన్నారై విద్యార్ధులు, వారి తల్లి తండ్రులు పాల్గొన్నారు.  

         

మరింత సమాచారం తెలుసుకోండి: