ట్రంప్ కి టైం అస్సలు బాలేదని చెప్పాలి. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఒక్కో సమస్య ఒక్కో వైపు నుంచీ ట్రంప్ ని టార్గెట్ చేస్తూ దూసుకు వస్తున్నాయి. కొన్ని నెలలుగా కరోన్నా సమస్య ట్రంప్ ని ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఆర్ధికంగా, మానసికంగా మాత్రమే కాదు ట్రంప్ ని  రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కొట్టింది కరోనా మహమ్మారి. ఇదిలాఉంటే తాజా జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం దాదాపు ట్రంప్ అమెరికాపై పెత్తనం కోల్పోయేలా చేసింది. అతడి హత్య తరువాత వరుసగా బయట పడుతున్న మరో కొందరు నల్లజాతీయుల హత్యల తాలూకు వివరాలు అమెరికా  రాజకీయాలపై   తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి..ఈ క్రమంలోనే తాజాగా అమెరికా రాజకీయాలని మరో సారి ఓ కుదుపు కుదిపేయడానికి సరికొత్త ఉద్యమం రానుంది..

 

అమెరికాలోని కరోనా చర్యలలో భాగంగా అమెరికాలో పన్ను చెల్లింపుల దారుల సొమ్మును కార్పోరెట్లకి కడుతోంది. అయితే ఈ మొత్తం సొమ్ముని ఎవరు ఇచ్చారు అనే విషయంపై ఇప్పటికీ కార్పోరేషన్ వెల్లడించలేదు. కానీ ఈ సొమ్ముని బయటకి తరలిస్తున్నారనే విషయం తెలియడంతో కార్పోరేషన్ ట్రెజరీ మంత్రి స్టీవ్ స్పందిస్తూ ఈ సొమ్ముని రహస్య సమాచారంగా భావిస్తున్నామని చెప్పడానికి సుముఖత చూపించలేదు. అయితే ఈ క్రమంలో పను చెల్లింపు సొమ్ముని ఎవరికీ ఇస్తున్నారో తెలియకుండా ట్రంప్ ఈ సొమ్ము మొత్తాని స్వాహా చేస్తున్నారని ఆరోపణలు మిన్నంటుతున్నాయి . ఈ నేపధ్యంలోనే

 

ట్రంప్ సర్కార్ వైఖరిపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్న నిపుణులు ట్రంప్ వైఖరిపై నిరసిస్తూ కాంగ్రెస్ తో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్దమయ్యారు ఈ ఉద్యమానికి మద్దతుగా పలు సామాజిక సంస్థలు, కార్యకర్తలు, కార్మిక సంఘాలు కూడా సంఘీభావం తెలుపుతున్నాయి. కరోనా సంక్షోభం సమయంలో ట్రంప్ సర్కార్ 500 మిలియన్ డాలర్లు ను  ఉద్దీపన చర్యల కోసం విడుదల చేసింది. అయితే ఈ సొమ్ము మొత్తాన్ని ట్రంప్ ఎవరెవరికి కేటాయించారు అనే విషయంపై స్పష్టత రాలేదు. సర్కార్ నుంచీ నిధులు పొందిన కార్పోరెట్ల పేర్లు వెల్లడించడంలో ట్రంప్ సర్కార్ ఎందుకు వెనకడుగు వేస్తోందో తెలియడం లేదని ఇది తీవ్రమైన చర్యలకి దారి తీస్తుందని అంటున్నారు నిపుణులు...అయితే ఈ విషయంపై స్పందిస్తున్న అమెరికన్స్ ప్రజల కోసం ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని పందికొక్కుల్లా మేక్కేశారని మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: