అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి ఆరోగ్యం సహకరించడం లేదా..74 ఏళ్ళ ట్రంప్ ఇకపై రాజకీయాలలో యాక్టివ్ పార్ట్ పోషించలేరా అంటే అవుననే చెప్పాలి అంటున్నారు పరిశీలకులు. ట్రంప్ కి వయసు మీద పడుతోంది అన్న విషయం కూడా గుర్తు చేస్తున్నారు. ట్రంప్ వ్యవహార శైలిలో గత కొంతకాలంగా మార్పు కనిపిస్తోందని. గతంలో కంటే కూడా ఇప్పుడు ఆయన అనారోగ్యంగా ఉన్నట్టుగా కన్పిస్తున్నారని ఆయన ప్రవర్తనలే అందుకు కారణమని అంటున్నారు..ఈ విషయంలో రిపబ్లికన్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోందని తెలుస్తోంది. ఇంతలా ట్రంప్ ఆరోగ్యంపై చర్చ జరగడానికి కల కారణం ఏమిటంటే..

అమెరికా సైనిక అకాడమీలో వారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న ట్రంప్ ఎంతో అలసటగా మాట్లాడటం స్పష్టంగా కన్పిస్తోందని..ఆ సమయంలో అలసటతో మంచి నీటి గ్లాసుని తన కుడి చేతిలో ట్రంప్ పైకి ఎత్తలేక పోయారు, నోటి వరకూ గ్లాసు తీసుకున్న ట్రంప్ ఎడమ చేతి సాయంతో మాత్రమే నీటిని త్రాగాల్సి వచ్చింది. ఈ సంఘటనతో ఒక్క సారిగా అక్కడ ఉన్న సైనికులు సిబ్బంది షాక్ అయ్యారు. ట్రంప్ కేవలం మంచినీళ్ళు త్రాగాలంటే రెండో చేయి సాయం అవసరమా అంటూ అందరూ చెవులు కొరుక్కున్నారు..ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ట్రంప్ ఆరోగ్యంపై మరిన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి..ఇదిలాఉంటే

కొన్ని రోజుల క్రితం ట్రంప్ ఆర్మీ కాలేజేకి వెళ్లి వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఆ తరువాత మెట్లు దిగి వెళ్ళడానికి ట్రంప్ పడిన శ్రమ కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ రెండు కారణాలని ఊటంకిస్తూ ట్రంప్ ఆరోగ్యంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు గమనించిన రిపబ్లికన్ పార్టీ నేతలు ట్రంప్ ఆరోగ్యం కుదురుగానే ఉంది..ఎన్నికల ఒత్తిడి పెరిగిపోవడం, పలు రాష్ట్రాలు తిరుగుతూ ప్రచారం చేయడంతో ట్రంప్ ఆరోగ్యంపై కొంత ప్రభావం ఉంటుందని అంటున్నారు. అయితే ఈ ఏడాది ట్రంప్ ఆరోగ్యంపై వార్షిక నివేదిక ఇవ్వక పోవడానికి గల కారణాలు ఏమిటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: