అమెరికా ఆర్ధిక మాంద్యం లో పీకల్లోతులో కూరుకుపోయింది. గతంలో అంటే అమెరికా చరిత్రలో ఇంలాంటి ఆర్ధిక సంక్షోభం ఎన్నడూ కలుగలేదని అంటున్నారు పరిశీలకులు. వివిధ రకాల అధ్యయనాల ప్రకారం చూస్తే అమెరికా పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారిపోయిందని లెక్కలు వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లని జీరోకి తగ్గించేసింది.  ఈ గందరగోళ సమయంలోనే కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. మళ్ళీ వారు కోలుకునే పరిస్థితి దాదాపు లేనట్లేనని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి నుంచీ మే నెల కాలంలో దాదాపు 50 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని బ్లూమ్ బర్గ్ నివేదిక అంచనా..

 

అమెరికాలో ఏ రంగం చూసుకున్నా దాదాపు కూలిపోయే పరిస్థతిలోనే ఉంది. దీనిని గాడిలో పెట్టడానికి బహుశా ఎన్నో ఏళ్ళు పట్టచ్చని కొందరు ఆర్ధిక వేత్తలు అంచనాలు వేస్తున్నారు. బ్లూమ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం అన్ని రకాల కంపెనీలు, అన్ని రంగాలు దాదాపు వారి ఆర్ధిక నిల్వలు కరిగించుకుంటున్నాయి. ఇప్పటికే 50 శాతం కంపెనీలు దివాళా అంచున ఉన్నాయని, మరో నెల రోజుల వ్యవధిలో మరిన్ని కంపెనీలు దివాళా  తీయడానికి సిద్దంగా ఉన్నాయని తెలిపింది. ఉద్యోగాలు కోల్పోయిన దాదాపు 50 శాతం మంది ప్రజలు ప్రస్తుతం ఉద్యోగాలని వేటాడుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి వారికోసం తీసుకుంటున్న చర్యలు అన్నీ కంటితుడుపు చర్యలు మాత్రమే నని ఈ నివేదిక వెల్లడించింది.

 

అయితే ఈ బ్లూమ్స్ బర్గ్ ఈ విపత్తు నుంచీ బయటపడే మార్గాలని కొన్ని సూచించింది. వాణిజ్య వర్తక రంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టాలని, తేల్చి చెప్పింది. సహజంగా వచ్చే ఆర్ధిక మాంద్యం సమయంలో కార్మికులు ఎలా పనిచేసుకుంటారో అలాంటి పరిస్థితులని కల్పించాలని తెలిపింది. ఉత్పత్తిని పెంచితే కంపెనీలకి ఇన్సెంటివ్ లు ఇస్తామని  సబ్సీడీలు , కొత్త ఋణాలు ఇస్తామని ప్రకటించాలని ప్రభుత్వానికి సూచించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిని వారి వారి నైపుణ్యానికి తగ్గట్టుగా వేరే చోట ఉపయోగించుకోవాలని తెలిపింది. నిరుద్యోగం ఇప్పటిలో తగ్గదు కాబట్టి నైపుణ్యాల పై దృష్టి పెట్టాలని పేర్కొంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: