కరోనా దెబ్బకు ఇప్పుడు అమెరికాలో విద్యారంగంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో యూనివర్సీటీల్లో చేరబోయే విద్యార్ధులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలేమిటి..? అనే దానిపై ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్, జూమ్ యాప్ ద్వారా వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ప్రముఖ విద్యా రంగ నిపుణులు యూనివర్సీటీ కన్సల్‌టెంట్స్ ఆఫ్ అమెరికా సీ.ఈ. ఓ.రాబర్ట్ లీవిన్‌తో  ఈ వెబినార్ ఏర్పాటు చేసింది. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని ఈ వెబినార్‌కు వ్యాఖ్యతగా వ్యవహరించారు. యూనివర్సీటీల్లో ప్రవేశాలకు ఎలాంటి పరీక్షలు ఉంటాయి..? తాజాగా కోవిడ్ నేపథ్యంలో అవి ఎలా మారాయి..? దరఖాస్తుల్లో కూడా ఎలాంటి మార్పులు వచ్చాయి..? అనే అంశాలపై రాబర్ట్ లీవిన్ ఈ వెబినార్‌లో వివరించారు.

 

దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ వెబినార్‌లో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు యూనివర్శీటీల్లో ప్రవేశాల గురించి వందలాదిగా తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. వెబినార్లో పాల్గొన్న పలువురి ప్రశ్నలకు సమాధానాలందించటం లో ప్రశాంత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.  నాట్స్ టెంపాబే టీం  ఏర్పాటు చేసిన  ఈ వెబినార్ నిర్వహణలో నాట్స్ బోర్డ్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ,  నాట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ టెంపా బే చాప్టర్ అడ్వైజరీ ఛైర్ శ్రీనివాస్ మల్లాది, టెంపాబే కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు,టెంపా బే సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ క్రియాశీల సభ్యులు ప్రసాద్ ఆరికట్ల తదితరులు ఈ వెబినార్ నిర్వహణ కీలకపాత్ర పోషించారు.  



ఈ వెబినార్ నిర్వహణకు సహకారం అందించిన నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, సెక్రటరీ విష్ణు వీరపనేని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీ కృష్ణ మేడిచెర్ల తదితరులకు నాట్స్ టెంపా బే విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: