ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అన్ని దేశాలని వణికిస్తోంది..ముఖ్యంగా అమెరికాలో ఈ వ్యాధి ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే కరోనాతో కుదేలయిన అమెరికాని ప్రకృతి సైతం వెంటాడుతోందనే చెప్పాలి. కరోనా ఎఫ్ఫెక్ట్, ఫ్లాయిడ్ , బూన్స్ హత్య ఉదంతాలతో అట్టుడుకుటున్న అమెరికాపై తాజాగా భూకంపం తీవ్రస్థాయిలో తన ప్రభావం చూపడంతో ఒక్క సారిగా అమెరికా ప్రజలు ఉలిక్కి పడ్డారు. ప్రస్తుతం ట్రంప్ ఎదుర్కుంటున్న సవాళ్ళతోనే ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు..తాజాగా ఈ విపత్కారం ఏర్పడటంతో ఊహించని ఈ పరిణామానికి షాక్ అయ్యాడని తెలుస్తోంది..

IHG

అమెరికాలోని న్యూజిల్యాండ్ లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై ఈ ప్రకంపనల తీవ్రత 7.1 గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.   కేర్మాడెక్ దీవులలోని దక్షిణ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించిందని ఈ దీవిలో భూకంప తీవ్రత దాదాపు 10 కోలోమీటర్ల లోతు వరకూ ప్రభావాన్ని చూపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రకంపనల కారణంగా న్యూజిల్యాండ్ లోని ఒపోటికిమ్, వాటాఖనే తౌరంగా రోటర్గా ప్రాంతాలపై అధిక తీవ్రత చూపిందని తెలుస్తోంది.

IHG

ఈ భూకంప తీవ్రత అధికంగా ఉందని..గతంలో ఇలాంటి తీవ్రత కలుగలేదని ఈ తీవ్రత కారణంగా భారీగా ఆస్థి, ప్రాణ నష్టాలు జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు, అమెరికా మీడియా భూకంపం సంభవించిన సమయం నుంచీ ప్రజలని అప్రమత్తం చేస్తోంది.ఇదిలాఉంటే భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్నా సునామీ వచ్చే అవకాశాలు ఎక్కువగా లేవని అమెరికా జియాలజిస్టులు అంటున్నారు. కానీ కొందరు నిపుణులు మాత్రం భూకంప తీవ్రత అధికంగా ఉంది కాబట్టి సునామీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఇప్పటికే న్యూజిల్యాండ్ లో కరోనా తగ్గిపోయిందని సంబర పడుతున్న క్రమంలో మళ్ళీ కొత్త కేసులు రావడంతో ఖంగారు పడుతుంటే తాజాగా ఈ భూకంపం వలన ఈ మహమ్మారి వైరస్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది స్థానిక ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: