అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నస్థానిక నిరుపేదలకు కూడా చేయూత అందిస్తోంది. తాజాగా అమెరికాలోని టెంపాబే స్థానిక నిరుపేదలకు నాట్స్ నిత్యావసరాలు పంపిణీ చేసింది. టెంపాబే మేయర్ జేన్ కాస్టర్ స్వయంగా ఈ పంపిణీ కార్యక్రమానికి వచ్చిన స్థానిక పేదలకు నాట్స్ తరపున నిత్యావసరాలు అందించారు. కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి తీవ్రంగా ఇబ్బందులు పడే పేదలను ఆదుకోవడానికి నాట్స్ ముందుకు రావడం అభినందనీయమని జేన్ కాస్టర్ ప్రశంసించారు.

 


కష్టకాలంలో సమాజానికి అండగా నిలవాల్సిన సమయమిదని.. ఎవరికి వారు చేతనైన సాయం చేసి.. పేదలకు చేయూత అందించాల్సిన తరుణమిదని నాట్స్ బోర్డు  డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. ఈ క్రమంలోనే నాట్స్ తన వంతు సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.  
నాట్స్ టెంపాబే విభాగంతో పాటు అవేర్‌నెస్ యూఎస్ఏ, డాక్టర్ కే పిడియాట్రిక్స్ తో కలిసి నిత్యావసరాలను పేదలకు అందించే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ పంపిణీ కార్యక్రమంలో 100 మందికి నాట్స్ నిత్యావసరాలతో కూడా సంచులను అందచేసింది. రమ్య పిన్నమనేని, విజయ్&ఫణి దలై, సోమంచి కుటుంబం, సుదర్శన్&రమ కామిశెట్టి, పూర్ణ&తార బిక్కసాని, బటర్ఫ్లై ఫార్మసీ యాజమానులు టోనీ, టూటూ తదితరులు ప్రధాన దాతలుగా తమ వంతు సాయం చేశారు.

 

ఇక నాట్స్ నుంచి టెంపా బే సమన్వయకర్త రాజేశ్ కాండ్రు, సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, అడ్వైజరీ ఛైర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ తదితరులు ఈ పంపిణీ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ వాలంటీర్లు ప్రసాద్ ఆరికట్ల, సుమంత్ రామినేని, సతీశ్ పాలకుర్తి, బిందుసుధలు పంపిణీలో తమ వంతు సాయం అందించారు.

 

నాట్స్ సెక్రటరీ విష్ణు వీరపనేని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ(మీడియా) మురళీ కృష్ణ మేడిచెర్ల తదితరులకు నాట్స్ టెంపా బే విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
కరోనాపై పోరాటంలో ఇతర నాట్స్ విభాగాలలోనూ స్థానిక పేదల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. నాట్స్ టెంపాబే విభాగం ఈ విషయంలో చూపుతున్న చొరవను వారు ప్రశంసించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: