అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా పై ఇప్పటికి ఓ క్లారిటీ లేదనే చెప్పాలి. తన మూర్ఖత్వంతో ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా కరోనాని అంటించేసిన ట్రంప్ అందుకు నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఈ కారణంగానే అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం 22 లక్షల కరోనా కేసులు..1.22 వేల కరోనా మరణాలు నమోదు అయ్యాయి. కనీసం కరోనా రోగులకి వైద్యం చేసే వైద్యులకి సైతం సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యాడు అగ్ర రాజ్యాధినేత. అమెరికాలో కరోనా చావులన్నిటికీ ట్రంప్ కారణమంటూ అమెరికా ప్రజలు ఇప్పటికి తిట్టి పోస్తున్నారు. అయినా ట్రంప్ ప్రవర్తనలో మార్పు రాలేదు....తాజాగా..

IHG

కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడిన ట్రంప్ ఎన్నికల ప్రచారం  దాదాపు 3 నెలల తరువాత మొదలు మొదలయ్యింది. అమెరికాలో ప్రధాన నగరాలలో ఇంకా కరోనా తగ్గుముఖం పట్టలేదు అయినా ట్రంప్ ఎన్నికల ప్రచారానికి తెర తీశారు. ఎవడు పొతే నాకేంటి అన్నట్టుగా ఒక్లహామాలోని టాల్సా ప్రాంతంలో వేలాది మందిని సమీకరించి ర్యాలీ ఏర్పాటు చేసి  సభని నిర్వహించారు. అయితే ఈ సభ తరువాత అమెరికాలో కరోనా వ్యాధి మరింతగా ప్రభాలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు..

IHG

నిన్న ఒక్క రోజులోనే అమెరికా వాప్తంగా సుమారు 30 వేల కేసులు నమోదు అయ్యాయని, ఈ ప్రభావం ట్రంప్ తాజా ఎన్నికల ర్యాలీ కి వచ్చిన వారిపై కూడా ఉంటుందని అంటున్నారు. అమెరికాలోని బ్రౌన్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ మేఘన్ మాట్లాడుతూ ట్రంప్ పర్యటనకి వచ్చిన వారిలో వివిధ రాష్ట్రాలకి చెందిన వారు కూడా ఉన్నారని వారి నుంచీ కరోనా ఒకరి నుంచీ మరొకరికి వేగంగా సోకే ప్రమాదం ఉందని ఆమె తెలిపారు. ఇప్పటికే ట్రంప్ క్యంపైన్ లో ఆరుగురికి కరోనా సోకిందని దాంతో ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి కూడా ఈ వ్యాధి సోకే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని ఆమె అన్నారు. ఆమె తాజా ప్రకటనతో ఒక్క సారిగా అమెరికా ప్రజలు ఉలిక్కి పడ్డారు. ట్రంప్ కొంప ముంచేశాడంటూ మండిపడుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: