కరోనా వైరస్.. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. రోజు రోజుకు దారుణంగా పెరిగిపోతుంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ మనిషి జీవనాన్నే మార్చేసింది. ఇంకా ఈ కరోనా వైరస్ ఎవరు అతీతం కాదు... పుట్టిన పిల్లాడికి కరోనా వస్తుంది 90 ఏళ్ళ వృద్దుడికి కరోనా వైరస్ వస్తుంది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే మెక్సికోలో అప్పుడే జన్మించిన ముగ్గురు కవలలకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చినట్టు వైద్యులు తెలిపారు. ఆ ముగ్గురు కవల పిల్లలతో పాటు తల్లికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. శాన్ లూయిస్ పోటోసి రాష్ట్రంలోని ఓ ఆసుపత్రిలో ఈ దాటినా చోటుచేసుకుంది. అయితే ముగ్గురు బిడ్డలకు కడుపులో ఉన్నప్పుడే కరోనా వైరస్ సోకిందని వైద్యులు తెలిపారు. 

 

అయితే అప్పుడే జన్మించిన పిల్లలకు కరోనా వైరస్ సోకడం అన్నది చాలా తక్కువ సందర్భాలలో జరుగుతుంది అని ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ఇంకా కరోనా వైరస్ ఒకేసారి ముగ్గురు పిల్లలకు సోకడం అనేది ప్రపంచంలోనే ఇది మొదటిసారి అని వైద్యులు  అంటున్నారు. కాగా ముగ్గురు పిల్లల్లో ఇద్దరు మగవారని, ఒక ఆడబిడ్డ అని వైద్యులు తెలిపారు. 

 

ఇంకా ఆ ముగ్గురు పిల్లల్లో ఇద్దరు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు అని.. ఒక మగ పిల్లవాడు మాత్రం శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడని వైద్యులు తెలిపారు. కాగా మెక్సికోలో ఇప్పటివరకు లక్షా 85 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే ఆ కొన్ని కరోనా వైరస్ కేసుల్లోనే మెక్సికో వ్యాప్తంగా 22,584 మందికిపైగా మరణించారు.                                                

మరింత సమాచారం తెలుసుకోండి: