అమెరికాలో ఇండియన్లు.. చాలామంది తమ టాలెంట్ చాటుతున్నారు. అందులోనూ.. కీలకపదవుల్లో చోటు సంపాదించుకుంటున్నారు. తాజాగా మరో ఎన్నారై.. అమెరికాలో సత్తా చాటాడు. ఏకంగాఅమెరికాలో జడ్జి అవుతున్నాడు. వాషింగ్టన్ లోని కోర్టుకు జడ్జిగా భారత సంతతికి చెందిన విజయ్ శంకర్ ఎంపికయ్యారు.

 

 

ఈ మేరకు అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్‌ నిర్ణయానికి సెనేట్‌ ఆమోదం లభిస్తే విజయ్‌ శంకర్‌ వాషింగ్టన్‌ డీసీలోని డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ అసోసియేట్‌ జడ్జిగా నియమితులవుతారు. ఇక మన విజయ్ శంకర్ గతం ఓసారి నెమరేసుకుంటే.. మనోడు.. డ్యూక్‌ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందాడు.

 

 

విజయ్‌ శంకర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి జ్యూరిస్‌ డాక్టర్‌గా పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత అక్కడే వర్జీనియా లా రివ్యూ నోట్స్‌ ఎడిటర్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ క్రిమినల్‌ విభాగంలో సీనియర్‌ లిటిగేషన్‌ కౌన్సెల్‌గా ఉన్నాడు మన విజయ్‌ శంకర్‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: