పాపం.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గత నాలుగేళ్లలో చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్ల గురించి పక్కన పెడితే.. ఈ నెల రోజుల్లో ట్రంప్ ఏం చేసిన సరే  అది పెద్ద హాట్ టాపిక్ గా మారుతుంది. 

 

IHG

 

ఇప్పటికే మొన్న ఫేస్ బుక్ యాడ్స్ బ్యాన్ చెయ్యడం.. నిన్న సోషల్ డిస్టెన్స్ పాటించకుండా సభలు ఏర్పాటు చేశారు అని ఇలా ఏదోకటి జరుగుతూనే ఉంది. ఇక ఈరోజు మరొకటి తెరమీదకు వచ్చింది. ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.. ట్రంప్‌కు ఇరాన్‌ ప్రభుత్వం అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది. 

 

IHG'Happy Good Friday' but, <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NETIZENS' target='_blank' title='netizens-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>netizens</a> are, well ...

 

ఇరాన్‌ అగ్రశ్రేణి జనరల్‌ కాసిమ్‌ సులేమాని బాగ్దాద్‌లో గత జనవరి 3న డ్రోన్‌ దాడిలో హత్యకు గురయ్యారు. ఇంకా ఈ విషయంపై ట్రంప్‌, మరో 30 మంది బాధ్యులుగా భావిస్తున్న ఇరాన్ ఈ వారంట్‌ జారీ చేసినట్లు స్థానిక ప్రాసిక్యూటర్‌ అలీ ఆల్కాసిమె రహ్‌ సోమవారం తెలిపారు. అయితే వారిని అదుపులోకి తీసుకోవడానికి ఇంటర్‌ పోల్‌ సహాయం కోరినట్లు వారు తెలిపారు.  

 

IHG

 

కాగా ట్రంప్‌కు, ఇతరులకు రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ ఇవ్వాలని ఇంటర్‌పోల్‌ని కోరినట్టు చెప్పారు. అయితే ఈ అంశంపై వ్యాఖ్యానించాలని ఫ్రాన్స్‌లోని లియాన్‌ కేంద్రంగా ఉన్న ఇంటర్‌పోల్‌ని కోరినప్పటికీ వారు స్పందించలేదు. దీంతో అమెరికా ఏకపక్షంగా టెహ్రాన్‌తో అణు ఒప్పందం విరమించుకున్నప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య మరింత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: