కరోనా ఎఫెక్ట్.. ప్రపంచంపై ఎంత పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా అల్లాడిపోతోంది. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కారణంగా విదేశాలలో ఉపాధికోసం వెళ్లిన వారు భారతీయులు అంత తిరిగి భారత్ కు వచ్చేస్తున్నారు. 

 

IHG

 

అయితే కరోనా వైరస్ నియంత్రించేందుకు విధించిన లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో ఎంతోమంది భారతీయులు చిక్కుకున్నారు. అయితే వారిని భారత్ కు తరలించేందుకు భారత ప్రభుత్వం ''వందే భారత్ మిషన్'ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ మిషన్ మే 7 వ తేదీన ప్రారంభం అయ్యింది. 

 

IHG's repatriation operation to bring back ...

 

ఇంకా ఈ మిషన్ లో భాగంగానే ఇప్పటి వరకు 5లక్షల మంది భారతీయులు ఇండియాకు చేరుకున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటించింది. రెండు నెలల్లోనే 137 దేశాల నుంచి 5,03,990 మందిని భారత్‌కు తరలించినట్లు పేర్కొంది. భారత్ కు చేరిన 5 లక్షల మందిలో కేరళకు చెందిన వారే సుమారు లక్షమంది వరకు ఉన్నట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. 

 

IHG

 

అయితే యూఏఈ నుంచే అత్యధికంగా 57వేల మందికిపైగా ప్రవాసులు భారత్‌కు చేరుకున్నట్లు వివరించింది. కాగా నేపాల్, భూటాన్ తదితర దేశాల నుండి రోడ్డు మార్గం ద్వారా 91 వేలమంది ఇండియాకు చేరినట్లు తెలిపింది. ఏది ఏమైతేనేం.. కరోనా వైరస్ కారణంగా ఏకంగా 5 లక్షల మంది భారతీయులు భారత్ కు చేరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: