కరోనా వైరస్... ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికించేస్తోంది. ఇంకా అలాంటి ఈ వైరస్ మన దేశంలోనే కాదు అగ్ర రాజ్యం అయినా అమెరికాలోను రోజుకు 50 వేలకుపైగా కరోనా కేసులు వస్తున్నాయి. 

 

IHG

 

ఇంకా అలానే సౌదీ అరేబియాలో కూడా కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతుంది. ఇప్పటికే రెండు లక్షల మార్క్ ను ఈ కేసులు దాటేశాయి. ఇంకా సౌదీ అరేబియాలో నిన్న ఒక్క రోజే 4,128 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 

 

IHG

 

ఇంకా అందులో 56 మంది మరణించారు.. 2,642 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని సౌదీ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశవ్యాప్తంగా 205,929 మందికి కరోనా వైరస్ సోకింది. 1,43,256 మంది కరోనా నుండి కోలుకున్నారు. అయితే ఇప్పటి వరకు సౌదీలో 1,858 మందిని కరోనా వైరస్ బలి తీసుకుంది. 

 

IHG

 

ఇంకా కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కోటి పదమూడు లక్షలమందికి కరోనా వైరస్ వ్యాపించింది. ఇంకా అందులో ఏకంగా 5 లక్షల మందికి పైగా మరణించారు. రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. మరి ఈ కరోనా ఎప్పుడు అంతం అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: