అమెరికాలో ఒక పక్క కరోన కేసుల ప్రభావం తీవ్రంగా ఉన్నా నవంబర్ లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ ఈ సారైనా అధ్యక్ష పీటాన్ని దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటే మరో పక్క రిపబ్లికన్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని తహతహలాడుతోంది. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి బిడెన్ కి మద్దతుగా మాజీ అధ్యక్షులు పార్టీ కీలక నేతలు అందరూ ప్రచారం ముమ్మరం చేస్తుండగా, ట్రంప్ మాత్రం నల్ల జాతీయుల హత్యలు, కరోనా, వంటి విషయాలలో తన అసమర్ధతతో కొట్టిమిట్టాడుతున్నాడు...ఈ క్రమంలోనే

 

అమెరికా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రముఖ నటి కిమ్ కర్దాషియన్ భర్త కేన్యే అమెరికా అధ్యక్ష పోటీ బరిలో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ పరిణామాలతో ఒక్క సారిగా ట్రంప్ ఉలిక్కి పడ్డట్టయ్యింది. రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగిన కేన్యే గతంలో రిపబ్లికన్ పార్టీ తరుపున ట్రంప్ అభ్యర్దిత్వానికి మద్దతు తెలిపారు. కానీ తాజాగా కేన్యే తాను కూడా అధ్యక్ష పోటీలో పాల్గొంటున్నట్టుగా ప్రకటించారు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటంటే..

 

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కేన్యే కి మద్దతు తెలపడంతో ఒక్క సారిగా రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. అంతేకాదు  కేన్యే వెస్ట్ అభ్యర్ధిత్వంపై అమెరికన్స్ కూడా మద్దతు తెలుపడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. తాను అధ్యక్ష బరిలో ఉండటానికి అన్ని అవకాశాలు, అర్హతలు ఉన్నాయని అమెరికా ప్రజల ముందు ఉంచిన హామీలు నెరవేర్చడమే నా లక్ష్యమని కేన్యే ప్రకటించారు. మన భవిష్యత్తుని మనమే నిర్ణయించుకోవాలనే స్లోగన్ తో దూసుకు వచ్చిన కేన్యే కి అమెరికా కార్పోరేట్ దిగ్గజ సంస్థలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి... ఇప్పటికే కరోనా, నల్ల జాతీయుల హత్యలు, పెరిగిపోతున్న నిరుద్యోగంతో పీకల్లోతు కష్టాలలో ఉన్న ట్రంప్ కి తాజా పరిణామాలు బిగ్ షాక్ ఇస్తున్నయనడంలో సందేహం లేదనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: