అమెరికాలో పనిచేస్తున్న ఎంతో మంది భారతీయ ఎన్నారైల పై ట్రంప్ వేసిన వీసా పిడుగు ప్రస్తుతం తన ప్రభావాన్ని చూపిస్తోంది. లెక్కకు మించిన భారత ఎన్నారైలు ఇప్పుడు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఒక పక్క కరోనా వలన పడుతున్న ఇబ్బందులు..మరొక వైపు ఉద్యోగాలు లేక..వీసా రెన్యువల్ కి అవకాశం లేక దిక్కు తోచని పరిస్థితులలో ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క అమెరికా పొమ్మంటుంది..మరో పక్క భారత్ వచ్చాక ఏమి చేయాలి అనే సందిగ్ధత ప్రస్తుతం ప్రతే ఒక్కరిలో అలుముకుంది..తాజాగా

 

అమెరికాలో ఈ తరహాలో ఇబ్బందులు పడుతున్న తమ భారతీయ ఉద్యోగులని ఇన్ఫోసిస్ సంస్థ భారత్ కి చేర్చడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. సుమారు 206 మంది తమ కంపెనీ ఉద్యోగులని ప్రత్యేక విమానం ద్వారా బెంగుళూరు కి తీసుకువచ్చింది. అమెరికాలో మా సంస్థలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగుల వీసాలకి కాలం చెల్లింది. మరలా రెన్యువల్ కి అవకాశం లేకుండా పోయింది..అందుకే వీరందరినీ సురక్షితంగా భారత్ కి తీసుకువచ్చామని ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ బోడె ప్రకటించారు...ఇదిలాఉంటే

 

ఇన్ఫోసిస్ ప్రకటించిన నివేదిక ప్రకారం అమెరికాలో తమ కంపెనీకి సుమారు 17,709 మంది ఉద్యోగులు ఉన్నారని. కరోనా కారణంగా విమానాలు రద్దు కావడంతో వీరిలో చాలా మంది తమని తమ స్వదేశాలకి చేర్చాలని కోరారు. ఇండియాకి వచ్చిన వారిలో చాలామంది హెచ్1 బీ, ఎల్ 1 వీసాలతో అమెరికా కార్యాలయంలో పనిచేస్తున్న వారే . అయితే ట్రంప్ తాజాగా నిర్ణయం కారణంగా వీరందరినీ భారత్ కి తరలించినట్టుగా సమాచారం అందుతోంది. ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులని ఖతర్ ఎయిర్వేస్ నుంచీ భారత్ తీసుకువచ్చిందని తెలుస్తోంది. తమ కంపెనీ తమకి చేసిన సాయాన్ని తలుచుకుని భారత ఉద్యోగులు  సోషల్ మీడియా ద్వారా  ఇన్ఫోసిస్ పై ప్రశంసలు కురిపించారు. ఇదిలాఉంటే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో భారీ సంఖ్యలో భారత ఎన్నారైలు భారత్ చేరుకుంటారని..ఈ పరిస్థితులు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: