అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనమే అవుతుంది. ట్రంప్ అధ్యక్షుడు అయ్యింది మొదలు ఇప్పటి వరకూ కూడా ప్రజా ఆమోద యోగ్యంగా నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. హెచ్ 1 బీ వీసా విషయంలో ట్రంప్ వ్యవహార శైలిపై సర్వాత్రా నిరసనలు రేగాయి ఈ విషయం అందరికి తెలిసిందే. కరోనా విషయంలో ట్రంప్ అలసత్వంతోనే అమెరికా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రస్తుత అమెరికా ఆర్ధిక పరిస్థితికి కారణం ట్రంప్ తీసుకునే ఏక పక్ష అవగాహన రాహిత్య నిర్ణయాలేనని అమెరికా మీడియా మండిపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి..అయితే తాజాగా ట్రంప్ తీసుకున్న మరొక నిర్ణయంపై ఆ దేశ వర్సిటీలు కోర్టులకి ఎక్కిన పరిస్థితి ఏర్పడింది..వివరాలోకి వెళ్తే..

IHG

అమెరికాలో ఆన్లైన్ క్లాసులకి మారిన యూనివర్సిటీలకి చెందిన విదేశీ విద్యార్ధులు స్వదేశాలకి వెళ్లిపోవచ్చు అంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా అందరిని విస్మయానికి గురి చేసింది. ట్రంప్ ఈ షాకింగ్ నిర్ణయంతో కళ్ళు బైర్లు కమ్మిన అమెరికా యూనివర్సిటీ లు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు కెక్కారు. అమెరికా ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కలిసి అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ , ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలపై  కోర్టులో పిటిషన్ వేశాయి.  

IHG

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమెరికాలో చదువుకుంటున్న ఎంతో మంది విదేశీ విద్యార్ధులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, మాకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆదేశాలు ఇచ్చారని, ఈ నిభంధనలను తక్షణమే నిలిపివేయమని ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నిభందనలు ఆర్ధిక పరిస్థితిపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని, విద్యార్ధుల భవిష్యత్తు కూడా ఆందోళనలో పడుతుందని కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఇదిలాఉంటే విదేశీ విద్యార్ధులకి న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తామని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ హామీ ఇచ్చారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: