అమెరికా అధ్యక్షుడి గురించి ప్రపంచ వ్యాప్తంగా అందరికి తెలిసింది ఒక కోణమేనట..ట్రంప్ లో మరో కోణం కూడా ఉందని, అదెలా ఉంటుందో..ట్రంప్ చేసిన చీటింగ్ పనులు ఏంటో ప్రపంచానికి తెలియజేస్తా అంటూ ట్రంప్ సోదరుడి కూతురు మేరీ ట్రంప్ ఏకంగా ట్రంప్ పై పుస్తకం రాసిన విషయం విధితమే. ఈ పుస్తకంలో తన తండ్రిని ట్రంప్ ఎలా మోసం చేశారు అంటూ ట్రంప్ అక్రమాలపై మొదలు పెట్టిన ఆమె మరిన్ని సంచలన విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయని తెలిపింది..అయితే

IHG

అమెరికా మీడియా కధనం ప్రకారం. ట్రంప్ సోదరుడి కూతురు మేరీ ట్రంప్ రాసిన  “ టూ మచ్ అండ్ నెవ్వర్ ఇనఫ్ – హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్ వరల్డ్ మోస్ట్ డేంజరస్ మ్యాన్” అనే పుస్తకంలో ట్రంప్ చదువుకునే రోజుల్లో ఓ ప్రఖ్యాత స్కూల్ లో  సీటు కోసం ఎలాంటి చీటింగ్ చేశారో కూడా రాసుకొచ్చిందని  తెలిపింది. ట్రంప్ పెన్సిల్వేనియాలోని వార్టన్ బిజినెస్ స్కూల్ లో అడ్మిషన్  కోసం మరొకరితో పరీక్ష రాయించారని దాంతో ఆ స్కూల్ లో సీటు వచ్చిందని అయితే ఓ తెలివిగల విద్యార్ధికి దక్కాల్సిన సీటుని ట్రంప్ చీటింగ్ చేసి సంపాదించారని ఈ విషయం మేరీ రాసిన పుస్తకంలో ఉందని మీడియా తెలిపింది.అంతేకాదు

IHG

ట్రంప్ పై తన తండ్రిపై కూడా మేరీ సంచలన కధనాలు రాసిందని తెలుస్తోంది. ఇదిలాఉంటే ఈ విషయంపై స్పందించిన వైట్ హౌస్ అధికారి కాన్వే మాట్లాడుతూ మేరీ సైకాలజీ చదివిందని అందరికి తెలుసు అయితే ట్రంప్ తన పేషెంట్ కాదనే విషయం ఆమె గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అయన తనకి అంకుల్ అవుతారనే విషయాని మేరీ మర్చిపోలేదు కదా అంటూ కామెంట్స్ చేశారు. ఈ పుస్తకంలో ఆమె అన్నీ అసత్యాలు రాసిందని కుటుంభ విషయాలు రోడ్డుకి ఈడ్చకూడదని అన్నారు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: