ఎడారి దేశం సౌదీ అరేబియాలో నేరాలకు శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అక్క‌డి చ‌ట్టాలు ఉల్లంఘిస్తే అంతే సంగ‌తులు. అలా ఇద్ద‌రు భార‌తీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్ద‌రిని ప్ర‌భుత్వ‌మే బ‌హిరంగంగా న‌రికింది చంపించింది. ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపుతోంది.

ఉపాధి కోసం  సౌదీ వెళ్లిన‌ భారతీయుల్లో కొందరు తెలిసో తెలీకో నేరాలు చేసి కఠిన శిక్షలు అనుభవిస్తుంటారు.  అలా 2015లో ఒక హత్య కేసులో హోషియాపూర్‌కు చెందిన సత్విందర్ కుమార్, లుథియానాకు చెందిన హర్జీత్ సింగ్ ఇరుక్కున్నారు. వీరికి అక్కడి న్యాయస్థానం మరణ శిక్షను విధించింది. ఈ సంగతిని వారి బంధువులకు కానీ ఇండియన్ ఎంబసీకి కానీ తెలియపడచకుండానే ఫిబ్రవరి 28న రహస్యంగా వారి తలా, మొండాలను వేరుచేసి శిక్షను అములుచేశారు అక్కడి అధికారులు.  ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న మృతుల బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. 


కాగా, గ‌త ఏడాది సైతం ఇదే రీతిలో ఓ మహిళా హక్కుల కార్యకర్తకు శిరచ్ఛేదం చేశారు. ఎస్రా అల్-ఘంఘం అనే మహిళకు న్యాయమూర్తి మరణ దండన శిక్ష విధించడంతో బహిరంగంగా ఆమె తల నరికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో తలారి ఆమె తలను నేలకు తాకేలా సరిగ్గా అమర్చి కత్తితో ఒక వేటుకి నరికేశాడు. నాలుగు రోడ్ల కూడలిలో భద్రతా బలగాల సమక్షంలో ప్రజలంతా చూస్తుండగా ఈ శిక్షను అమలు చేశారు. ఘంఘంని ఆమె భర్త సయ్యద్ మూసా జాఫర్ హషెం కళ్లెదురుగా డిసెంబర్ 8, 2015న భద్రతా బలగాలు అదుపులోకి తీసుకొన్నాయి. రాజద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆమెపై అభియోగం మోపినట్టు లండన్ నుంచి వెలువడే అల్-ఖుద్స్ అల్-అరేబియా వార్తాపత్రిక తన ట్విట్టర్ అకౌంట్ లో తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: